CA Final Exam : చెల్లికి 1, అన్నకు 18.. సీఏలో అదరగొట్టిన అన్నాచెల్లెలు, సీఏ పాస్ అవడమే కష్టమనుకుంటే

చార్టెర్డ్ అకౌంటెన్సీ(CA) పరీక్షల్లో పాస్ అవడమే కష్టం అని అనుకుంటే ఆ అన్నా చెల్లెలు అదరగొట్టేశారు. ఏకంగా ఆలిండియా ర్యాంకులు సాధించారు. మధ్యప్రదేశ్ మొరెనాకు చెందిన నందిని అగర్వాల్ (

CA Final Exam : చెల్లికి 1, అన్నకు 18.. సీఏలో అదరగొట్టిన అన్నాచెల్లెలు, సీఏ పాస్ అవడమే కష్టమనుకుంటే

Ca Final Exam

CA Final Exam : చార్టెర్డ్ అకౌంటెన్సీ(CA) పరీక్షల్లో పాస్ అవడమే కష్టం అని అనుకుంటే ఆ అన్నా చెల్లెలు అదరగొట్టేశారు. ఏకంగా ఆలిండియా ర్యాంకులు సాధించారు. మధ్యప్రదేశ్ మొరెనాకు చెందిన నందిని అగర్వాల్ (19) సీఏ ఫైనల్ లో 614/800 మార్కులు సాధించి ఆలిండియా నెంబర్ 1 ర్యాంకర్ గా నిలిచింది. ఆమె సోదరుడు సచిన అగర్వాల్ (21) 18వ ర్యాంకు సాధించాడు. స్కూల్ టైమ్ నుంచి ఇద్దరం కలిసి చదువుకునే వాళ్లమని, ఐపీసీసీ, ఫైనల్ కూడా కలిసి ప్రిపేర్ అయ్యామని నందిని చెప్పింది.

వీరిద్దరూ విక్టర్ కాన్వెంట్ స్కూల్ విద్యార్థులు. 2017లో క్లాస్ 12 పూర్తి చేసుకున్నారు. బాల్యంలోనే నందిని రెండు తరగతులు జంప్ చేసింది. అలా తన అన్నయ్య చదువుతున్న క్లాస్ లోకి వచ్చింది. 83వేల 606 మంది అభ్యర్థులు చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఫైనల్ ఎగ్జామినేషన్ కు రిజిస్టర్ చేసుకున్నారు.

PF Transfer Online : మీ అకౌంట్‌ నుంచి డబ్బులు ఈజీగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోండిలా!

నేను, నా అన్న స్కూల్ నాటి నుంచి కలిసి చదువుకుంటున్నాం. ఐపీసీసీ, సీఏ ఫైనల్ కి కలిసి ప్రిపేర్ అయ్యాం. మా స్ట్రాటజీ చాలా సింపుల్. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటాం. అంతకన్నా ఎక్కువగా విమర్శ చేసుకుంటాం. మేము క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసినప్పుడు.. నా పేపర్ ని తను, తన పేపర్ ని నేను చెక్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో నేను నమ్మకాన్ని కోల్పోయాను.

Wrong Account : మీ డబ్బులు మరో అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేశారా? రీఫండ్ అవుతాయా? ప్రాసెస్ ఇదిగో!

ఆ సమయంలో అన్నయ్య నాకు అండగా నిలిచాడు. మళ్లీ గాడిన పడేలా చేశాడు. కరోనా మహమ్మారి ఎంతో మంది అభ్యర్థుల ప్రిపరేషన్ ను వృథా చేసింది. కానీ మాకు మాత్రం బాగా ప్లస్ అయ్యింది. ఆ సమయాన్ని మేము మరింత సద్వినియోగం చేసుకున్నాం. మరింత ఎక్కువగా చదువుకోవడానికి, టాపిక్స్ రివైజ్ చేయడానికి మాకు వీలు దొరికింది అని నందిని చెప్పింది.