CM KCR : అప్పటివరకూ.. మహారాష్ట్రకు వస్తూనే ఉంటా-నాందేడ్ సభలో కేసీఆర్

తెలంగాణ మోడల్ విద్యుత్, రైతుబంధు, దళితబంధు లాంటి పథకాలు అమలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.(CM KCR)

CM KCR : అప్పటివరకూ.. మహారాష్ట్రకు వస్తూనే ఉంటా-నాందేడ్ సభలో కేసీఆర్

CM KCR : తెలంగాణ మోడల్ విద్యుత్, రైతుబంధు, దళితబంధు లాంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. రైతులకు బీమా సౌకర్యం కల్పించాలన్నారు. రైతు పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఈ పథకాలు అమలు చేస్తే నేను మహారాష్ట్రలో అడుగుపెట్టను అని చెప్పారు. అమలు చేసేంత వరకు మహారాష్ట్రకు వస్తూనే ఉంటానని, రైతులతో కలిసి ఇక్కడ ఆందోళన చేస్తానని కేసీఆర్ తేల్చి చెప్పారు.

మహారాష్ట్ర నాందేడ్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. సభ విజయవంతం కాకుండా అడ్డుకునే యత్నాలు జరిగాయని ఆరోపించారు. నాందేడ్ కు ఎక్కువ వెళ్తున్నావంటూ మహారాష్ట్ర పశ్చిమ ప్రాంత నేతలు అడుగుతున్నారని కేసీఆర్ చెప్పారు.

తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు మహారాష్ట్రలో అమలయ్యేంత వరకు నేను ఇక్కడికి వస్తూనే ఉంటాను అన్నారు కేసీఆర్. తెలంగాణ పథకాలను మహారాష్ట్రలో ఎప్పుడైతే అమలు చేస్తారో అప్పుడిక నేను ఇక్కడికి రానేరానని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ కీలక నేత ఫడ్నవిస్ కు సవాల్ విసిరారు. మహారాష్ట్రలో కూడా దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు కేసీఆర్.(CM KCR)

Also Read.. Jagadish Reddy: కేంద్ర ఉద్యోగాల కోసం బండి సంజయ్ ఢిల్లీలో ధర్నా చేయాలి: మంత్రి జగదీష్ రెడ్డి

”అంబేద్కర్ లాంటి మహానేతలు పుట్టిన ప్రాంతం ఇది. దేశంలో 75ఏళ్లలో 70ఏళ్లు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పాలించాయి. ప్రజలకు, రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. నేను చెప్పేది నిజమా? అబద్దమా? మీరు ఆలోచించాలి. ఎవరు పాలించినా పెద్దగా లబ్ది జరగలేదు. దేశంలోనే సాగుకు అనుకూలంగా ఉన్న భూమి ఎక్కువగా ఉంది. 50వేల టీఎంసీల నీరు ఏటా వృథాగా పోతోంది.

కృష్ణా, గోదావరి ఇక్కడే పుట్టినా ఇక్కడ తాగునీటి సమస్య తీరలేదు. నీళ్లు ఇవ్వరు. కానీ బీజేపీ నేతలు పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తారు. అవసరం కంటే ఎక్కువ నీళ్లు అందుబాటులో ఉన్నాయి. నాతో కలిసి ఉద్యమం చేయండి. ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుంది. దేశంలో బొగ్గు నిల్వలు 125 ఏళ్ళ వరకు ఇచ్చేందుకు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రజలకు విద్యుత్ అందదు” అని సీఎం కేసీఆర్ అన్నారు.

మహారాష్ట్రలోని ప్రతి జిల్లా పరిషత్ లో గులాబీ జెండా ఎగరడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ను మహారాష్ట్రలో కూడా రిజిస్టర్ చేయించామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్న కేసీఆర్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు.

తమ ప్రాంతంలో సభ పెట్టాలని కోరుతూ మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి వినతులు వస్తున్నాయని.. తర్వాతి సభను షోలాపూర్ లో పెడతామని కేసీఆర్ చెప్పారు. నాందేడ్ లో తాము సభ పెట్టిన వెంటనే రైతుల ఖాతాల్లో రూ.6 వేలు జమ చేశారని.. బీఆర్ఎస్ సభ సత్తా ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని కేసీఆర్ అన్నారు. రైతులు ఐక్యంగా ఉండి పిడికిలి బిగిస్తే న్యాయం జరుగుతుందన్నారు. ఒకప్పుడు మహారాష్ట్ర కంటే తెలంగాణ దారుణంగా ఉండేదని.. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారిందన్నారు. మహారాష్ట్రలో సంపదకు కొదవ లేదని.. అయితే దాన్ని ప్రజలకు ఇవ్వాలన్న ఆలోచన పాలకులకు లేదని చెప్పారు. రైతులు ఝలక్ ఇస్తే మొత్తం మారిపోతుందన్నారు.(CM KCR)

Also Read..KA Paul: రాహుల్ గాంధీపై అనర్హత వేటు సిగ్గు చేటు.. ప్రపంచం నవ్వుతోంది.. బండి సంజయ్‌పై పిటిషన్ వేస్తా

”దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది. దేశాన్ని 54 ఏళ్లు కాంగ్రెస్, 14 ఏళ్లు బీజేపీ పాలించి చేసిందేమీ లేదు. కృష్ణా, గోదావరి నదులు పుట్టే మహారాష్ట్రలో సాగు, తాగు నీరు చాలా చోట్ల అందుబాటులో లేదు. పాలకులు మారుతున్నా ప్రజల తలరాత మాత్రం మారడం లేదు. ఉల్లి, చెరుకు ధర కోసం రైతులు ప్రతి ఏటా పోరాడాల్సి వస్తోంది” అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.