Buchi Babu : ఎన్టీఆర్ – బన్నీతో సినిమా ఎప్పుడు..?

సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబు ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.. ఎంట్రీతో సూపర్ హిట్ కొట్టినా.. ఇప్పటివరకూ ఇంకో సినిమా లేకుండా ఖాళీగా ఉన్నాడు బుచ్చిబాబు..

Buchi Babu : ఎన్టీఆర్ – బన్నీతో సినిమా ఎప్పుడు..?

Buchi Babu

Buchi Babu: ఎంట్రీ ఇచ్చాడో లేదో 100 కోట్ల కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేశాడు. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా టాలీవుడ్‌ని ఎట్రాక్ట్ చేశాడు. కానీ, ఈ రికార్డుల ‘ఉప్పెన’ ఆ సినిమా క్రేజ్ వరకే ఆగిపోయింది. వరుసగా సినిమాలు చేసే అవకాశాలు వస్తాయనుకున్న ‘ఉప్పెన’ డైరెక్టర్.. నెక్ట్స్ సినిమా కన్ఫమ్ అవ్వక ఊరికే కూర్చున్నాడు.

ఒక్క ఛాన్స్ ..ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఎంతో మంది డైరెక్టర్లు టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వాటిలో కొంతమందికి మాత్రమే ఛాన్స్ దొరుకుతుంది. అలా దొరికి తన సత్తాని తెలుగు సినిమాకి చూపించాడు యంగ్ డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు.. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబు ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీతో సూపర్ హిట్ కొట్టినా.. ఇప్పటివరకూ ఇంకో సినిమా లేకుండా ఖాళీగా ఉన్నాడు బుచ్చిబాబు.

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా తెరకెక్కి, తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్‌గా ప్లే చేసిన ‘ఉప్పెన’ సూపర్ హిట్ అయ్యింది. కరోనా టైమ్‌లో రిలీజ్ అయినా కూడా కలెక్షన్లలో ఏమాత్రం తగ్గకుండా 100 కోట్ల కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమని సరికొత్తగా ప్రేక్షకుల ముందుంచడంతో సినిమా సూపర్ హిట్ అయ్యి డైరెక్ట్ చేసిన బుచ్చిబాబుని తెగ మెచ్చుకున్నారు జనాలు. జనాలతో పాటు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, హీరోలు కూడా సినిమా సూపర్ అని ,బుచ్చిబాబు తోపు అని అన్నారు. కానీ సినిమా ఛాన్స్ మాత్రం ఎవ్వరూ ఇవ్వలేదు.

‘ఉప్పెన’ సక్సెస్‌తో వరుసగా సినిమా ఛాన్సులు వస్తాయనుకున్న బుచ్చి బాబుకి మాత్రం ఇంకా రెండో సినిమా కన్ఫమ్ అవ్వలేదు. ఎన్టీఆర్‌తో సినిమా చెయ్యాలనుందన్న ఈ యంగ్ డైరెక్టర్ ఆల్రెడీకథ కూడా నెరేట్ చేశాడు. పనిలో పనిగా బన్నీకి కూడా స్టోరీ చెప్పేశాడని టాక్. ఈ ఇద్దరిలో ఎవరూ ఇంత వరకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరి ఈ 100 కోట్ల కలెక్షన్ల సినిమా తీసిన డైరెక్టర్‌కి సెకండ్ ఛాన్స్ ఎప్పుడిస్తారో, ఎవరిస్తారో చూడాలి.