Bathuku Busstand : బన్నీ కజిన్ ‘విరాన్’ సాంగ్ విన్నారా..!
బన్నీ కజిన్ విరాన్ ముత్తంశెట్టి ‘బతుకు బస్టాండ్’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు..

Bussa Bussa Lyrical Song From Bathuku Busstand
Bathuku Busstand: అల్లు ఫ్యామిలీ తరపు నుండి మరో కొత్త హీరో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. బన్నీ కజిన్ విరాన్ ముత్తంశెట్టి ‘బతుకు బస్టాండ్’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. నికిత అరోరా, శృతి శెట్టి హీరోయిన్లు.. ఇలవల ఫిల్మ్స్ బ్యానర్ మీద చక్రధర్ రెడ్డి సమర్పణలో IN రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కవితా రెడ్డి, కె.మాధవి నిర్మిస్తున్నారు.
Bathuku Busstand : బన్నీ కజిన్, విరాన్ ముత్తంశెట్టి ‘బతుకు బస్టాండ్’ గ్లింప్స్ చూశారా!..
‘బతుకు బస్టాండ్’ అనే టైటిల్ పెట్టినట్లుగా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి అటు సాధరణ ప్రేక్షకులతో పాటు తెలుగు ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. మొదటి పాట యూట్యూబ్‌లో విశేషాదరణ అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ‘బుస్సా బుస్సా’ అంటూ సాగే ఓ మాస్ ఐటమ్ సాంగ్‌కు సోషల్ మీడియాతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటలో బ్రెజిలియన్ మోడల్ జెన్నీఫర్ పిక్కినాటో చిందెయ్యడం విశేషం.
ఈ పాటకు ఇంత మంచి ఆదరణ రావడం చాలా ఆనందంగా చిత్ర దర్శకుడు ఐ.ఎన్. రెడ్డి తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కంప్లీట్ అయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు.