By-Polls : ఉపఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. హుజురాబాద్ బైపోల్ లేటయ్యేనా..?

సెప్టెంబర్ లోనే హుజురాబాద్, బద్వేల్ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐతే.... తాజా బైపోల్ షెడ్యూల్ లో వీటికి చోటు దక్కలేదు.

By-Polls : ఉపఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. హుజురాబాద్ బైపోల్ లేటయ్యేనా..?

Cec

By Polls : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపఎన్నికల షెడ్యూల్ పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. హుజురాబాద్, బద్వేల్ బైపోల్స్ పై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. దేశంలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప-ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

పశ్చిమ బెంగాల్‌లో మూడు, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానానికి బైపోల్ షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. వెస్ట్ బెంగాల్ లో… ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఐతే.. పలు కారణాలతో… బెంగాల్‌ రాష్ట్రంలో 3 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. భవానీపూర్, శంషేర్‌గంజ్, జంగీపూర్ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది.

Read This : Huzurabad : హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై టీపీసీసీ సరికొత్త వ్యూహం

ఈ నాలుగు స్థానాల్లో సెప్టెంబర్ 30న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 3న ఫలితాలు రానున్నాయి. సెప్టెంబర్ 6 ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఈ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో.. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 13.

మరి హుజూరాబాద్, బద్వేల్ ఎప్పుడు..?

తెలంగాణలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గం ఖాళీ అయింది. అటు ఏపీలో.. వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోని బద్వేల్ సెగ్మెంట్ లో…. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అకాల మరణంతో… ఉపఎన్నికల అనివార్యమయ్యింది. ఈ రెండు సెగ్మెంట్లలో బైపోల్ జరగాల్సి ఉంది.

సెప్టెంబర్ లోనే హుజురాబాద్, బద్వేల్ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐతే…. కేంద్రం తాజాగా రిలీజ్ చేసిన బైపోల్ షెడ్యూల్ లో… హుజూరాబాద్ , బద్వేల్ లకు చోటు దక్కలేదు. దీంతో… ఈ రెండు బైపోల్స్ మరింత ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే హుజురాబాద్, బద్వేల్ లో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం స్పీడును పెంచాయి. హుజురాబాద్ అయితే… మినీ సంగ్రామాన్నే తలపిస్తోంది. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుండగా… కాంగ్రెస్ తమ క్యాండిడేట్ పై ఇంకా కసరత్తు కొనసాగిస్తోంది.