Cabbage : గుండెకే కాదు, ఎముకలకు మేలు చేసే క్యాబేజీ

బరువు తగ్గాలనుకునే వారు క్యాబేజీని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే జుట్టు ఆరోగ్యంతోపాటు, కండరాల నొప్పులను నివారించటంలో ఉపకరిస్తుంది.

Cabbage : గుండెకే కాదు, ఎముకలకు మేలు చేసే క్యాబేజీ

Cabbage

Cabbage : క్యాబేజీని ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. క్యాబేజీలో పోషకాలతోపాటు ఎన్నో ఆరోగ్యసమస్యల నుండి మనల్ని కాపాడుతుంది. ముఖ్యంగా క్యాబేజీలో విటమిన్ ఎ, రిబోఫ్లేవిన్, ఫోలేట్, బి లు, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. క్యాబేజీలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బుల నుండి కాపాడుతుంది. క్యాన్సర్ నిరోధకంగా కూడా ఇది దోహదపడుతుందని పరిశోధనల్లో తేలింది.

శరీరంలో కొవ్వు నిల్వలు పోగుకాకుండా చూస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్ధాయిలను సమతుల్యం చేస్తుంది. జీర్ణక్రియలను మెరుగు పరచటంలో దోహదపడుతుంది. కాల్షియం లోపంతో బాధపడేవారు క్యాబేజీ ఆహారంలో భాగం చేసుకోవటం ఉత్తమం. దీనిని తీసుకోవటం వల్ల శరీరంలోని ఎముకలు, దంతాలు, గుండె ఇలా ప్రతి అవయవానికి కాల్షియం అందుతుంది. రోజువారీ డైట్‌లో దీనిని చేర్చుకోవచ్చు.

బరువు తగ్గాలనుకునే వారు క్యాబేజీని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే జుట్టు ఆరోగ్యంతోపాటు, కండరాల నొప్పులను నివారించటంలో ఉపకరిస్తుంది. క్యాబేజీలో ఉండే బీటా కెరోటిన్ కంటి లోపల వచ్చే మచ్చలను నివారిస్తుంది. పోటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు తగ్గుతుంది. సూప్, కూరగాయలు, సలాడ్ రూపంలో దీనిని తీసుకోవచ్చు. పాలిచ్చే తల్లులు క్యాబేజీని తింటే పాలు బాగా పడతాయి. క్యాబేజ్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తుండటంతో పోషకాహార నిపుణులు దీనిని మంచి ఆహారంగా సూచిస్తున్నారు.