Crypto Finance : క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేస్తేనే బెటర్..పార్లమెంటరీ కమిటీ అంగీకారం

గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి ఎనలేని క్రేజ్ కనిపిస్తోంది. బిట్ కాయిన్, ఎథేరియం, బియాన్స్ కాయిన్ వంటి క్రిప్టోలు ఎత్తుపల్లాలు చూసినప్పటికి ఎక్కువమంది

Crypto Finance : క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేస్తేనే బెటర్..పార్లమెంటరీ కమిటీ అంగీకారం

Crypto (1)

Crypto Finance : గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి ఎనలేని క్రేజ్ కనిపిస్తోంది. బిట్ కాయిన్, ఎథేరియం, బియాన్స్ కాయిన్ వంటి క్రిప్టోలు ఎత్తుపల్లాలు చూసినప్పటికి ఎక్కువమంది ఇన్వెస్టర్లకు సంపదను సృష్టిస్తున్నాయి. షిబా ఇను వంటి క్రిప్టోలు అకస్మాత్తుగా వందలు, వేల రెట్లు జంప్ చేశాయి.

క్రిప్టో కొనుగోలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లే, భారత్‌లోను ఇందులో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. అయితే దేశంలో అంతకంతకూ విస్తరిస్తన్న క్రిప్టో కరెన్సీ అంశంపై సోమవారం పార్లమెంటరీ స్థాయీ సంఘం(ఆర్థిక) కీలక సమావేశం నిర్వహించింది. పారిశ్రామిక వర్గం ప్రతినిధులు, నిపుణులు ఈ భేటీలో పాల్గొన్నారు.

క్రిప్టోకరెన్సీని నియంత్రించడం సాధ్యం కాదని, అందుకే దానికి చట్టబద్ధత కల్పించాలని పులువురు నిపుణులు భేటీలో సూచించినట్లు సమాచారం. దీనికి సంబంధించి విధివిధానాలు రూపొందించాలని సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే క్రిప్టో కరెన్సీని నియంత్రణ బాధ్యతను ఎవరికి అప్పగించాలనే విషయంపై స్పష్టత లేదు. ఇన్వెస్టర్ల సంపదకు భద్రత కల్పించడం అత్యంత తీవ్రమైన విషయమని సమావేశంలో పాల్గొన్న ఎంపీలు అభిప్రాయడపడినట్లు తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీ ప్రకటనలు జాతీయ వార్తా పత్రికల్లో మొదటి పేజీలోనే బ్యానర్​లా రావడంపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

అయితే, క్రిప్టో అంశంపై అధికారులతో ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన కొద్ది రోజుల తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇదే అంశంపై ఇవాళ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ALSO READ Secretaries Tenure Extebded : హోం,రక్షణ ఐబీ సెక్రటరీలు,రా చీఫ్ పదవీకాలం పొడించిన కేంద్రం