UP Violence: కేంద్రమంత్రి కొడుకుపై మర్డర్ కేసు

రైతుల కంప్లయింట్ ను ఆధారంగా చేసుకుని... కేంద్రమంత్రి కొడుకు సహా పలువురిపై మర్డర్ కేసు నమోదుచేసినట్టు పోలీసులు చెప్పారు.

UP Violence: కేంద్రమంత్రి కొడుకుపై మర్డర్ కేసు

Up Lakhimpur Kheri Issue

UP Violence: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ లో నిన్న(అక్టోబర్ 4, 2021) జరిగిన కాన్వాయ్ ప్రమాద ఘటన, తర్వాతి హింసాత్మక ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా తేని కొడుకుపై పోలీసులు హత్యారోపణ కింద కేసు నమోదుచేశారు. కేంద్ర సహాయ శాఖ మంత్రి కొడుకుతో పాటు.. మరికొందరిపైనా FIRలో పలు సెక్షన్లు బుక్ చేశారు పోలీసులు.

రైతు నిరసనపై ఇటీవల రెచ్చగొట్టే కామెంట్స్ చేశారంటూ.. యూపీలో కేంద్రమంత్రుల పర్యటనను అడ్డుకునేందుకు రైతు సంఘాల నేతలు ప్రయత్నించారు. ఈ సమయంలో కాన్వాయ్ లోని ఓ వాహనం రైతులపైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్పాట్ లోనే ఓ రైతు చనిపోయాడు.. తర్వాత.. జరిగిన ఘర్షణల్లో.. రైతులు, బీజేపీ కార్యకర్తలు కలిపి 8 మంది చనిపోయారు.

Lakhimpur : యూపీలో రైతుల ఆందోళన హింసాత్మకం..ఎనిమిది మంది మృతి

రైతులపైనుంచి దూసుకుపోయిన వాహనంలో కేంద్రమంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా ఉన్నాడనేది రైతుల ప్రధాన ఆరోపణ. ఈ అలిగేషన్స్ ను మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా ఇప్పటికే ఖండించారు. “మా 3 వాహనాలను డిప్యూటీ సీఎం ఆహ్వానించారు. దారి మధ్యలోనే కొందరు దుండగులు తమ కార్లపైకి రాళ్లు విసిరి… నిప్పుపెట్టారు. ముగ్గురు, నలుగురు కార్యర్తలను కొట్టి చంపేశారు” అని ఆశిష్ మిశ్రా చెప్పారు. తమ రూట్ ను డైవర్ట్ చేశారని మంత్రి అజయ్ మిశ్రా తేని అన్నారు.

మరోవైపు… రైతుల కంప్లయింట్ ను ఆధారంగా చేసుకుని… కేంద్రమంత్రి కొడుకు సహా పలువురిపై మర్డర్ కేసు నమోదుచేసినట్టు పోలీసులు చెప్పారు. రైతులు తమకు నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం కోరుతున్నారని లఖింపూర్ డిప్యూటీ మెజిస్ట్రేట్ ఏకే చౌరాసియా అన్నారు.

UP : లఖింపూర్ ఖేరిలో ఫుల్ టెన్షన్, అఖిలేష్ హౌస్ అరెస్టు..అసలు ఏం జరిగింది ?