Celebrities Advertisements: పాన్ మసాలా ప్రమోషన్లు.. హీరోలకు బాధ్యత లేదా?

స్టార్లు ఊరికే అయిపోతారా..? అభిమానంతో గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఫాన్సే సెలబ్రిటీలకు స్టార్ హోదా కల్పిస్తారు. ఇది మనసులో పెట్టుకుని ఒళ్లు దగ్గరపెట్టుకుని భాద్యతగా ఉండాలి కానీ..

Celebrities Advertisements: పాన్ మసాలా ప్రమోషన్లు.. హీరోలకు బాధ్యత లేదా?

Celebrities Advertisements

Celebrities Advertisements: స్టార్లు ఊరికే అయిపోతారా..? అభిమానంతో గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఫాన్సే సెలబ్రిటీలకు స్టార్ హోదా కల్పిస్తారు. ఇది మనసులో పెట్టుకుని ఒళ్లు దగ్గరపెట్టుకుని భాద్యతగా ఉండాలి కానీ.. డబ్బులొస్తున్నాయి కదా అని పనికి రాని యాడ్లు, పాన్ మసాలా యాడ్లు చేస్తున్నారు. అక్షయ్ కుమార్ లాంటి హీరోలు మాత్రం ఫాన్స్ దెబ్బకి దిగొచ్చారు కానీ.. మరి మిగతా హీరోలకు బాధ్యతుండక్కర్లేదా..?

Telugu Stars: హిందీ సినిమా వద్దు.. పాన్ ఇండియా ముద్దు.. ఇదే మన హీరోల ఇంట్రెస్ట్!

బాద్యతుండక్కర్లేదా అనిఫీలవుతున్నారు ఫాన్స్. ఎంతో అభిమానంతో హీరోలకు పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేస్తుంటే.. మీరు మాత్రం పనికి రానియాడ్లు, పాన్ మసాలా బ్రాండింగ్ లు చేస్తూ.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విమల్ ఇలైచీ పాన్ యాడ్ చేసినందుకు సోషల్ మీడియాలో ఉతికి ఆరేశారు. హెల్తీ లివింగ్ అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతారు కానీ.. చేసేవి పాన్ యాడ్లు అంటూ.. తెగతిట్టిపోశారు. ఈ నాన్ స్టాప్ ట్రోలింగ్ కి దెబ్బకి దిగొచ్చారు అక్షయ్. సారీ తప్పైంది.. మిమ్మల్ని హర్ట్ చేశాను.. ఇంకెప్పుడూ ఇలాంటి పాన్ యాడ్స్ చెయ్యను అంటూ సోషల్ మీడియాలో పెద్ద పోస్టే పెట్టారు.

Stars Investments: రియల్ ఎస్టేట్స్ నుంచి స్టార్టప్స్ వరకూ.. అంతటా స్టార్స్ పెట్టుబడులే!

అక్షయ్ కుమార్ ఫాన్స్ ట్రోలింగ్ కి తగ్గి, తలొగ్గి ఇక నుంచి చెయ్యనని దారికొచ్చాడు. మొన్నీమధ్య అల్లు అర్జున్ కూడా ఇలాంటి యాడ్ చెయ్యమంటే.. ఎన్నికోట్లిచ్చినా సరే రాంగ్ మెసేజ్ ఇచ్చే యాడ్స్ ని చచ్చినా ప్రమోట్ చెయ్యనంటూ తేల్చి చెప్పేశారు. ఇక స్టార్ హీరోయిన్ సాయిపల్లవి కూడా ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ కి కోట్లిస్తానన్నా.. సారీ బాస్.. నేను అబద్దపు బ్యూటీ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చెయ్యనంటూ తెగేసి చెప్పింది. వీళ్లందరూ రియల్ హీరోయిజం చూపించి మిస్ లీడ్ చేసే బ్రాండ్లకు బాద్యతగా నో చెప్పారు. మరి మిగతా వాళ్ల సంగతేంటి..? ఇలాంటి పాన్ యాడ్లు పనికి మాలిన యాడ్లు చేసుకుంటూ ఫాన్స్ కి రాంగ్ మెసేజ్ ఇస్తున్న స్టార్లకు బాధ్యతుండక్కర్లేదా?

Bollywood Stars: ప్రొడక్షన్ దగ్గర నుంచి ఐపీఎల్ వరకు.. అంతటా స్టార్స్ పెట్టుబడులే!

స్టార్ హీరో మహేష్ కూడా ఫాన్స్ ని ప్రొవోగ్ చేసే కొన్ని యాడ్స్ చేస్తున్నారు. స్టార్ సెలబ్రిటీ అయ్యిండి.. తంబాకు సబ్సిడరీ ప్రొడక్ట్ యాడ్.. పాన్ బహార్ చేస్తున్నారు మహేష్ బాబు. మహేష్ తో పాటు బాలీవుడ్ యంగ్ హీరోలు టైగర్ ష్రాఫ్ కూడా ఈ యాడ్ కి ఎండార్స్ చేశారు. ఇక కమలా పసంద్ అనే గుట్కా సబ్సిడరీ ప్రొడక్ట్ యాడ్ లో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్, రణవీర్ సింగ్ ఎంగేజ్ అయ్యారు.. నటిస్తున్నారు. పాన్ బేస్డ్ విమల్ ఇలైచీ యాడ్ ని షారూఖ్ ఖాన్, అజయ్ దేవ్ గన్ కలిసి ప్రమోట్ చేస్తున్నారు. అయితే స్టార్ హీరోలు ఏం చేసినా నడుస్తుందనే రోజులు పోయాయి. మంచి పనులుచేస్తే.. ఎంత ఆకాశానికెత్తేస్తారో.. ఇలాంటి నెగెటివ్ వైబ్స్ ఇచ్చే యాడ్స్ చేస్తే అదే రేంజ్ లో ఆడుకుంటారు.. సో ఫాన్స్ తో జాగ్రత్తగా ఉండాల్సిందే అని ఫీలవుతున్నారు స్టార్లు.