Serials : ఇకపై సీరియల్స్ లో కౌగిలింతలు, సన్నిహిత దృశ్యాలు బంద్

మన సీరియల్స్ లో కౌగిలింతలు, అమ్మాయి అబ్బాయి మధ్య సన్నిహిత దృశ్యాలు మామూలు అయిపోయాయి. ఇక హిందీ సీరియల్స్ అయితే ముద్దు సన్నివేశాలను కూడా మాములుగా తీసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి

Serials : ఇకపై సీరియల్స్ లో కౌగిలింతలు, సన్నిహిత దృశ్యాలు బంద్

Serials

Serials :  మన సీరియల్స్ లో కౌగిలింతలు, అమ్మాయి అబ్బాయి మధ్య సన్నిహిత దృశ్యాలు మామూలు అయిపోయాయి. ఇక హిందీ సీరియల్స్ అయితే ముద్దు సన్నివేశాలను కూడా మాములుగా తీసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి సన్నివేశాలపై కొరడా విధించారు. అయితే ఆ ఆంక్షలు ఇక్కడి సీరియల్స్ పై కాదు. పాకిస్థాన్ లో తాజాగా ఆ ఆంక్షలు విధించినట్టు తెలుస్తుంది.

ఇక నుంచి పాకిస్థాన్ సీరియల్స్ లో కౌగిలింతలు, సన్నిహిత దృశ్యాలు, పడక గది సన్నివేశాలు.. ఇలాంటి వాటిని ఆపేయాలని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అధారిటీ (పిఎంఆర్ఈ) ప్రకటించింది. ఇలాంటి వాటిపై పాకిస్థాన్ ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అందుకే వీటిని ఆపేస్తున్నట్టు ప్రకటించింది. అంతే కాక ఇలాంటివి పాకిస్థాన్ సంసృతి, సాంప్రదాయాల్ని, ఇస్లామిక్ సాంప్రదాయాల్ని విస్మరిస్తున్నాయని తెలిపారు. పాకిస్థాన్ లోని అన్ని శాటిలైట్ ఛానల్స్ ఈ రూల్స్ ని పాటించాల్సిందే అని, ఒకవేళ ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అధారిటీ తెలిపింది. ఇకపై సీరియల్ కంటెంట్ ని ముందే చెక్ చేసి ఇలాంటి సన్నివేశాలు లేకపోతేనే టెలికాస్ట్ చేయాలని తెలిపింది.

Bigg Boss 5 : వరస్ట్ పర్ఫార్మర్ అన్నందుకు సన్నీకి ముద్దులిచ్చిన ప్రియా

అయితే ఈ రూల్ పై మిశ్రమ స్పంద వస్తుంది. కొంతమంది ఇస్లామిక్ సంసృతిని కాపాడాలంటే ఇలాంటివి ఆపడం కరెక్ట్ అని అంటుంటే కొంతమంది పరువు హత్యలు, మహిళలపై హింస లాంటివి ఆపకుండా ఇలాంటివి మాత్రమే ఎందుకు ఆపారు అని ప్రశ్నిస్తున్నారు. ఇవే రూల్స్ మన దేశంలో వస్తే చాలా సీరియల్స్ కి కత్తెర పడుతుందని భావిస్తున్నారు.