Corona Vaccine: రేపటి నుండి వ్యాక్సిన్లపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు!

రేపటి (జూన్ 21) నుండి కేంద్రం దేశవ్యాప్తంగా నూతన వ్యాక్సినేషన్ విధానం అమలు చేయనుంది. ఈ మేరకు రేపటి నుంచి అమలులోకిరానున్న వ్యాక్సిన్లపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశ ప్రజలకు ఉచితంగా కరోనా టీకాలు ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం వ్యాక్సిన్ డోసులను సేకరించనుంది.

Corona Vaccine: రేపటి నుండి వ్యాక్సిన్లపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు!

Corona Vaccine (2)

Corona Vaccine: రేపటి (జూన్ 21) నుండి కేంద్రం దేశవ్యాప్తంగా నూతన వ్యాక్సినేషన్ విధానం అమలు చేయనుంది. ఈ మేరకు రేపటి నుంచి అమలులోకిరానున్న వ్యాక్సిన్లపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశ ప్రజలకు ఉచితంగా కరోనా టీకాలు ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం వ్యాక్సిన్ డోసులను సేకరించనుంది. సేకరించిన వ్యాక్సిన్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా అందజేయనుంది. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉచితంగా టీకాలు పంపిణీ చేయనున్నాయి.

వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు ఒక నెలలో ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ డోసుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు 25 శాతం మాత్రమే అనుమతినిచ్చిన కేంద్రం అందులో కూడా పెద్ద, చిన్న ఆస్పత్రులను బ్యాలెన్స్ చేసుకుంటూ… అందరికీ వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలని సూచించింది. వ్యాక్సిన్ డోసులు అమ్మేందుకు నేషనల్ హెల్త్ అథార్టీకి చెందిన ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ అథార్టీ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలకు చెల్లింపులు చేయనుండగా.. శివారు ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా వ్యాక్సిన్లు చేరేలా చెయ్యాలని సూచించింది.

హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 ఏళ్లు దాటిన వాళ్లు, రెండో డోసు పెండింగ్ ఉన్నవారు, 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు వారికి ప్రాధాన్యతా క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ఇవ్వాలని సూచించారు. 18 ఏళ్లు దాటిన వారి విషయంలో.. ఎవరికి ముందుగా వెయ్యాలి… అనే ప్రాధాన్యతా క్రమాన్ని తయారుచేసుకోడానికి రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రాల్లో జనాభా, కరోనా వ్యాప్తి, ఇప్పటివరకూ జరిగిన వ్యాక్సినేషన్, వేస్ట్ అయిన వ్యాక్సిన్లు అన్నీ లెక్కలోకి తీసుకొని రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులను కేంటాయించనున్న కేంద్రప్రభుత్వం.. ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు ఇచ్చేదీ… ముందుగానే సమాచారం ఇవ్వనున్నట్లు తెలిపింది.

కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్ డోసులకు అనుగుణంగా రాష్ట్రాలు… జిల్లాలకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచించింది. జిల్లాల్లోని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఎక్కడ ఎన్ని వ్యాక్సిన్లు లభిస్తాయో ప్రభుత్వ వెబ్‌సైట్లలో రాష్ట్ర ప్రభుత్వాలు తెలపాలని సూచించారు. వ్యాక్సిన్ల లభ్యత, ఎక్కడ లభిస్తాయో ప్రజలకు రాష్ట్రప్రభుత్వాలు అవగాహన కలిగించాలని.. వ్యాక్సిన్ తయారీ సంస్థలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ డోస్ ధర నిర్ణయించనుండగా.. ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాక్సిన్ వేసినందుకు… సర్వీస్ ఛార్జీల కింద డోసుకు రూ.150కి మించి తీసుకోకూడదని స్పష్టం చేసింది.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలన్న కేంద్రం.. ఎవరైనా డబ్బు చెల్లించి వ్యాక్సిన్ వేసుకోగలం అనుకుంటే… అలాంటి వారు ప్రైవేట్ ఆస్పత్రుల వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లి వేయించుకోవచ్చని తెలిపింది. వెనుకబడిన వర్గాల వారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ వేసుకోవడం కోసం నాన్-ట్రాన్స్ఫరబుల్ ఎలక్ట్రానిక్ వోచర్స్ ను అందుబాటిలోకి తెచ్చింది.