Telangana : తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తగ్గించాలని, కేంద్ర సంస్థల నుంచి అప్పులు ఇవ్వాలని ఢిల్లీకి వస్తున్నారని తెలిపారు. GHMC లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నట్లు, మార్చి..

Telangana : తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy

Central Minister Kishan Reddy : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ మూకుమ్మడిగా దాడి పెంచేస్తోంది. కేంద్ర మంత్రులు రంగంలోకి దిగి ప్రభుత్వంపై పలు విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తగ్గించాలని, కేంద్ర సంస్థల నుంచి అప్పులు ఇవ్వాలని ఢిల్లీకి వస్తున్నారని తెలిపారు. GHMC లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నట్లు, మార్చి నెల జీతాలు ఇంకా ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్రం పేదలు లేనట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. లఖీమ్ పూర్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటే అభ్యంతరం లేదని.. మంచి చేస్తామంటే తాము అడ్డుకోమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Read More : Kishan Reddy On Paddy : అప్పుడు మీటర్లు, ఇప్పుడు వడ్లు.. టీఆర్ఎస్ రాద్దాంతం చేస్తోందన్న కిషన్ రెడ్డి

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా తయారైంది. ఇరు పార్టీలకు చెందిన నేతలు విమర్శల వర్షం కురిపిస్తుండడంతో పొలిటికల్స్ ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పేరిట యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రను అడ్డుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నించడం.. బీజేపీ నేతలు ఎదురుతిరుగుతుండడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో.. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య ఘటన, రామాయంపేటలో ఘటనపై బీజేపీ ఆగ్రహంతో ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. నిరసన ర్యాలీలో బండి సంజయ్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు సైతం రంగంలోకి దిగుతున్నారు. ప్రభుత్వంపై విమర్శళ బాణాలు ఎక్కుపెడుతున్నారు. దీనికి టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మరింత హీట్ ఎక్కిస్తున్నాయి.