Aadhaar number: మీ ఆధార్‌తో లింకింగ్ ఉన్న ఫోన్ నెంబర్ల గురించి తెలుసుకోండిలా..

ఈ ఆధార్ నెంబర్ తో లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్లన్నింటి గురించి తెలుసుకోవచ్చు. అవును నిజమే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) న్యూ వెబ్‌సైట్‌లో సింపుల్‌గా చెక్ చేసుకోవచ్చు.

Aadhaar number: మీ ఆధార్‌తో లింకింగ్ ఉన్న ఫోన్ నెంబర్ల గురించి తెలుసుకోండిలా..

Aadhar Phone Numbers

Aadhaar Number: ఈ ఆధార్ నెంబర్ తో లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్లన్నింటి గురించి తెలుసుకోవచ్చు. అవును నిజమే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) న్యూ వెబ్‌సైట్‌లో సింపుల్‌గా చెక్ చేసుకోవచ్చు. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాండ్ మేనేజ్మెంట్ అండ్ కన్జూమర్ ప్రొటెక్షన్ (TAFCOP) కోసం టెలికాం అనలిటిక్స్ ఈ వెబ్‌సైట్‌ను పరిచయం చేసింది.

TAFCOP నోట్స్ లో సవివరంగా ఇలా రాసుకొచ్చింది. ‘సబ్‌స్క్రైబర్ల వినియోగం మరింత సులువయ్యేలా వెబ్‌సైట్ డెవలప్ చేశారు. వారి పేరు మీద మొబైల్ కనెక్షన్లు ఎన్ని పనిచేస్తున్నాయో తెలుసుకోవచ్చు. ఏవైనా అదనపు మొబైల్ కనెక్షన్లు ఉన్నా.. వాటిని నియంత్రించుకోచ్చు. సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా కస్టమర్ అక్విజిషన్ ఫామ్ (CAF)లు పూర్తి చేయడం ప్రాథమిక బాధ్యత.

దీనిపై పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కూడా ట్విట్టర్ ద్వారా రెస్పాండ్ అయ్యారు. TRAI/DOT చాలా ఉపయోగకరమైన సర్వీసు లాంచ్ చేసింది. సైట్ ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఒకటే పేరు లేదా ఐడీతో ఎన్ని సిమ్ కార్డులు రిజిష్టర్ అయి ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఓటీపీ ఎంటర్ చేయగానే లిస్ట్ కనిపిస్తుందని ప్రశంసించారు.

ప్రస్తుతం ఈ వెబ్‌సైట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. మీరు కూడా ఫోన్ నెంబర్లు చెక్ చేసుకోవాలనుకుంటే.. ఇలా చేయండి.

Step 1: టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్‌సైట్‌ను ఎంటర్ చేయాలి. (https://tafcop.dgtelecom.gov.in/)

Step 2: పది అంకెల్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 3: ఆ తర్వాత కిందనే ఉన్న రిక్వెస్ట్ ఓటీపీ బటన్ ను క్లిక్ చేయండి.

Step 4: ఫోన్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.

Step 5: ఆధార్ తో లింక్ అయి ఉన్న అన్ని మొబైల్ నెంబర్లు వెబ్ సైట్లో కనిపిస్తాయి.

అవసరమైతే ఉపయోగంలో లేని ఫోన్ నెంబర్లను స్క్రీన్ మీద కనిపించే సూచనల ప్రకారం.. రిపోర్ట్ చేసి బ్లాక్ కూడా చేయొచ్చు.