Boy Rescued: బోరుబావిలో బాలుడు.. 110 గంటల తర్వాత సురక్షితంగా..
ఛత్తీస్‌ఘడ్‌లోని పిహ్రిద్ గ్రామానికి చెందిన రాహుల్ సాహు అనే బాలుడు శుక్రవారం సాయంత్రం బోరుబావిలో పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యుల సమాచారంతో అధికార యంత్రాంగం రక్షణ చ్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు అధికారులు నిరంతరం బాలుడిని రక్షించే పనులను పర్యవేక్షించారు.

Boy Rescued: ఛత్తీస్‌ఘడ్‌లో బోరుబావిలో పడిపోయిన బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. దాదాపు నాలుగున్నర రోజులుగా (110 గంటలు) బోరుబావిలోనే ఉన్న బాలుడిని రక్షణ సిబ్బంది, అధికారులు నిర్విరామంగా శ్రమించి క్షేమంగా బయటకు తీశారు. ఛత్తీస్‌ఘడ్‌లోని పిహ్రిద్ గ్రామానికి చెందిన రాహుల్ సాహు అనే పదకొండేళ్ల బాలుడు శుక్రవారం సాయంత్రం బోరుబావిలో పడిపోయాడు.
Tirumala : ముగిసిన జ్యేష్టాభిషేకం
వెంటనే కుటుంబ సభ్యుల సమాచారంతో అధికార యంత్రాంగం రక్షణ చ్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు అధికారులు దగ్గరుండి నిరంతరం బాలుడిని రక్షించే పనులను పర్యవేక్షించారు. సీఎం కూడా బాలుడి గురించి ఎప్పటికప్పుడు ఆరాతీశారు. బాలుడిని రక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్టీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (ఎస్డీఆర్ఎఫ్)తోపాటు ఆర్మీ, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 80 అడుగుల లోతున్న బోరుబావిలో బాలుడు దాదాపు 70 అడుగల లోతున పడిపోయాడు. దాదాపు 110 గంటలపాటు గొయ్యి తవ్వి, తర్వాత మరో టన్నెల్ తవ్వి బాలుడ్ని రక్షించారు. బాలుడిని బయటకు తీసేందుకు అన్ని రకాల వనరుల్ని, టెక్నాలజీని ప్రభుత్వం వాడుకుంది. మంగళవారం సాయంత్రం బాలుడి నుంచి ఎలాంటి కదలిక లేదు. దీంతో అధికారులు ఆందోళన చెందారు.
Adivi Sesh : పాఠశాల విద్యార్థులకు ‘మేజర్’ బంపర్ ఆఫర్..
తర్వాత ఆహారం కోసం మెల్లిగా స్పందించాడు. దీంతో మళ్లీ అధికారులు ఆశాభావంతో పనిచేశారు. దాదాపు 500 మంది సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాలుడిని బయటకు తీసిన అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాలుడిని త్వరగా ఆసుపత్రికి చేర్చేందుకు అధికారులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. బాలుడు రాహుల్ సాహు సురక్షితంగా బయటపడటంపై ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ బఘెల్ హర్షం వ్యక్తం చేశారు. అధికారులను అభినందించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు.
- YS Jagan: శ్రీకాకుళం జిల్లాకు సీఎం వరాల జల్లు
- Uddhav Thackeray: ఉద్ధవ్‌కు కోవిడ్ నెగెటివ్.. అధికార నివాసాన్ని వీడనున్న సీఎం
- Jawans Killed: ఛత్తీస్‌ఘడ్‌లో నక్సల్స్ కాల్పులు.. ముగ్గురు జవాన్లు మృతి
- Assam Floods: అసోంలో వరదలు.. 11 మంది మృతి
- Chhattisgarh Boy: 40 గంటలుగా బోరుబావిలో బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
1Cardamom : నోటి ఇన్ ఫెక్షన్లతోపాటు, దుర్వాసన పోగొట్టే యాలకులు!
2Eknath Shinde: డ్రమ్స్ వాయిస్తూ షిండేకు ఘనస్వాగతం పలికిన ఆయన సతీమణి.. వీడియో వైరల్
3SpiceJet: వరుసగా విమాన ప్రమాదాలు.. స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు
4Tejashwi Yadav: అవసరమైతే లాలూను చికిత్స కోసం సింగపూర్‌కు తీసుకెళ్తాం: తేజస్వీ యాదవ్
5Watermelon Seeds : రక్తపోటును అదుపులో ఉంచే పుచ్చగింజలు!
6Andhra Pradesh: మళ్ళీ అధికారంలోకి రావడానికి టీడీపీ ఇలా చేసింది: భూమన
7Ginger Tea : వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే అల్లం టీ!
8Bandi Sanjay: టీఆర్ఎస్ సర్కారుని ఇరుకున పెట్టేలా.. బీజేపీ 88 ఆర్టీఐ దరఖాస్తులు
9Kaali : ‘కాళి’ డాక్యుమెంటరీ పోస్టర్ పై క్షమాపణలు చెప్పిన అగాఖాన్ మ్యూజియం.. మరింత రెచ్చగొట్టేలా డైరెక్టర్ పోస్ట్..
10Covid Vaccine: కోటి 36లక్షల కొవిడ్ డోసులు చెత్త బుట్టలోకి..
-
Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
-
The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
-
IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్‌ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?