పేడను కొనుగోలు చేయనున్న ప్రభుత్వం : కిలో ఎంతంటే..

  • Published By: nagamani ,Published On : July 6, 2020 / 03:44 PM IST
పేడను కొనుగోలు చేయనున్న ప్రభుత్వం : కిలో ఎంతంటే..

ఇంట్లో పశువుల పేడను ఏం చేస్తాం అంటే..పిడకలు చేస్తాం..లేదా చేపల చెరువలకు అమ్మేస్తాం అని చెబుతారు. కానీ ఇకనుంచి ఆ పేడను గవర్నమెంటుకే అమ్ముకోవచ్చు. ఇదేదో జోక్ అనుకోవద్దు. నిజమే. గవర్నమెంటే స్వయంగా పేడను కొనటానికి ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 25న ప్రారంభించిన ‘గోధన్ న్యాయ్’ పథకం కింద ప్రభుత్వం ప్రజలనుంచి పేడను కొనుగోలు చేయనుండి. ఈ పథకం జులై 20 నుంచి ప్రారంభంకానుంది. ఈ పథకంలో భాగంగా ప్రజలనుంచి ప్రభుత్వం కిలో ఆవు పేడను రూ.1.5కి కొంటుంది. పేడే కదా అని చులకనగా చూడకండి. పేడ కూడా మీకు ఆర్థికంగా అండగా ఉండే రోజులు రాబోతున్నాయంటోంది చత్తీస్ గఢ్ ప్రభుత్వం.

పశు సంపదపై ఆధారపడి జీవించే గ్రామీణ ప్రజలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని జూన్ 25న ప్రారంభించింది. చత్తీస్ గఢ్ ప్రభుత్వం ‘గోధన్ న్యాయ్’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా కిలో ఆవుపేడను రూ. 1.5కి కొనుగోలు చేయనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసే పేడను వర్మీ కంపోస్ట్ తయారీలో వినియోగించనుంది.

ఈ సందర్భంగా సీఎం భూపేశ్ భాగేల్ మాట్లాడుతూ..ఈ పథకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందనీ..స్వయం సహాయక బృందాల్లోని మహిళలు ఇంటింటికీ వెళ్లి ఆవు పేడను సేకరిస్తారని తెలిపారు. ఈ పథకం కోసం ఓ కార్డును కూడా జారీ చేస్తామని… పేడ కొనుగోలు చేసిన తారీఖు..వంటి వివరాలను ఇందులో నమోదు చేస్తామని తెలిపారు. ఈ పథకాన్ని పర్యవేక్షించేందుకు గ్రామ స్థాయిలో గోధన్ కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నామని..అదే పట్టణాలు, నగరాల్లో ఈ కార్యక్రమాన్ని పురపాలక సంఘాలు పర్యవేక్షిస్తాయని తెలిపారు.

ఆవుల నుంచి పాలు తీసుకున్న తరువాత వాటి యజమానులు వాటిని విచ్చలవిడిగా వదిలివేస్తున్నారనీ..దీంతో అవి రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలబారిన పడుతున్నాయనీ..అంతేకాదు అలా విచ్చలవిడిగా వదిలివేసిన జంతువులు పంటలను నాశనం చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. కానీ అలా వదిలివేస్తున్న ఆవులు రోడ్లమీదనే పేడను వేస్తుంటాయి. దీంతో పారిశుద్ధం కూడా దెబ్బతింటోంది. ఈక్రమంలో ఆవుల పెంపకం దారులకు లాభసాటిగా మార్చటానికి వాటి యజమానులు సంరక్షించే దిశగా చూస్తారని భావిస్తున్నామని తెలిపారు.

ఆవులను పెంపకాన్ని సంరక్షించడం..వాటిని మరింతగా మెరుగుపరచడం, వర్మి కంపోస్ట్ ఉత్పత్తిని ప్రోత్సహించడం..గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం అనే లక్ష్యంతో ఆవు పేడను 1.5 కిలోల చొప్పున సేకరించాలని కమిటీ నిర్ణయించిందని వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన కమిషనర్ ఎం గీతా చెప్పారు.

దీనిపై ప్రతిపక్ష బీజేపీ పార్టీ సభ్యులు మాట్లాడుతూ..ఈ పథకం ఎంతమాత్రం ఆచరణ కాదనీ విమర్శిస్తున్నారు. ఛత్తీస్ ఘడ్ లో రైతులు ఆవుపేడను అస్సలు అమ్మరు. ఒకవేళ ప్రభుత్వం కొనుగోలు చేయాలని అనుకుంటే ఆవుపేడను సేకరించిన తరువాత దాన్ని వర్మి కంపోస్ట్ గా చేయటానికి గల ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవని విమర్శించారు. ఆవుపేడ కొనుగోలుకు సంబంధించి బడ్జెట్ గురించి కూడా ప్రభుత్వం చెప్పాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తోంది.

Read Here>>ఈ ప్లానెట్ చాలా హాట్ గురూ, ప్రతి 36 గంటలకు 4 సీజన్లు, 2 వేసవులు-2 శీతాకాలాలు