Chickpea Farmers : తెగుళ్లతో శనగ రైతు కుదేలు

ఖరీఫ్‌లో సాగు చేసిన మిరప, పత్తి తదితర పైర్లు పూర్తిగా దెబ్బతిని రైతులు బాగా నష్టపోయారు. ప్రత్యామ్నాయంగా వేసిన శనగ పంట విక్రయంతో... ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత మేర బయటపడొచ్చని భావించారు. పంట మంచి దశలో ఉన్నపుడు ఎండుతెగులు, తుప్పు తెగులు ఆశించి చాలా ప్రాంతాల్లో పంట ఎండిపోయింది.

Chickpea Farmers : తెగుళ్లతో శనగ రైతు కుదేలు

Chickpea Farmers

Updated On : April 16, 2023 / 8:56 AM IST

Chickpea Farmers : శనగ సాగు చేసిన రైతులకు ఈసారి అంతా ప్రతికూలంగా మారింది. పంటలు భాగా పండుతాయని ఆశపడిన రైతులను ఎండు తెగులు దెబ్బతీసింది. ఖరీఫ్ పంట నష్టాన్ని ఈ పంటతో పూడ్చుకుందామనుకున్న రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి. ఎండు, తుప్పు తెగుళ్ల ప్రభావంతో ప్రకాశం జిల్లాలో శనగ దిగుబడి గణనీయంగా పడిపోయింది.

READ ALSO : Peanut Cultivation : వేరుశనగ సాగులో రైతులు అనుసరించాల్సిన నీటియాజమాన్యం!

ప్రస్తుతం కందుకూరు మండలంలో పంట నూర్పిళ్లు చురుగ్గా సాగుతున్నాయి. పైరు ఆశాజనకంగా ఉండి, తెగుళ్లు సోకని పొల్లాలో ఎకరాకు 7 నుండి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా… తెగుళ్ల ప్రభావం ఉన్న చోట ఒక క్వింటాకు మించడం లేదు .

ఖరీఫ్‌లో సాగు చేసిన మిరప, పత్తి తదితర పైర్లు పూర్తిగా దెబ్బతిని రైతులు బాగా నష్టపోయారు. ప్రత్యామ్నాయంగా వేసిన శనగ పంట విక్రయంతో… ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత మేర బయటపడొచ్చని భావించారు. పంట మంచి దశలో ఉన్నపుడు ఎండుతెగులు, తుప్పు తెగులు ఆశించి చాలా ప్రాంతాల్లో పంట ఎండిపోయింది.

READ ALSO : Groundnut : రబీ వేరుశనగలో పొగాకు లద్దె పురుగు నివారణ!

జిల్లాలో దాదాపు లక్ష హెక్టార్లలో శనగ సాగు చేయగా, ఇందులో కందుకూరు మండలంలోని, పాలూరు దొండపాడు గ్రామంలోనే దాదాపు 2 వేల ఎకరాల్లో శనగను సాగుచేశారు. ఎండుతెగులు కారణంగా అధిక విస్తీర్ణంలో పంట నష్టం వాటిల్లింది .

సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో దిగుబడి ఎకరాకు ఒక క్వింటాకు మించకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ఈ ఏడాది అన్ని విధాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

READ ALSO : Green Gram Cultivation : పెసర సాగులో అనుసరించాల్సిన యాజమాన్యం !