Peanut Cultivation : వేరుశనగ సాగులో రైతులు అనుసరించాల్సిన నీటియాజమాన్యం!

ఊడలు దిగే దశనుండి కాయలు ఊరే దశవరకు అనగా విత్తిన 45 రోజుల నుండి 90 రోజుల వరకు పంట చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ దశలో నీరు సక్రమంగా తగుమోతాదులో పెట్టుకోవాలి.

Peanut Cultivation : వేరుశనగ సాగులో రైతులు అనుసరించాల్సిన నీటియాజమాన్యం!

Peanut Cultivation :

Peanut Cultivation : వేరుశనగను సెప్టెంబర్ నుండి ముందస్తు రబీ పంటగా విత్తుతారు. వేరుశనగలో అనువైన రకాలు ఎంచుకొని సాగుచేసేటప్పుడు చిన్నచిన్న మెళకువలు పాటిస్తే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చు. ముఖ్యంగా వేరుశనగలో నీరు తగినంత అవసరమౌతుంది. సకాలంలో నీటి అవసరాలు తీర్చగలిగితే పంట నాణ్యత దెబ్బతినకుండా ఉండటంతోపాటు, దిగుబడి పెరుగుతుంది. రైతులు నీటి విషయంలో తగిన యాజమాన్య పద్దతులు పాటించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

వేరుశనగలో నీటి యాజమాన్యం;

వేరుశనగకు 500 మి.మీ నీరు అవసరమవుతుంది. తేలికనేలల్లో 8 తడులు ఇస్తే సరిపోతుంది. నేలలో తగిన పదును ఉండగా విత్తిన తరువాత 20 రోజుల వరకు నీటిని పారించకూడదు.

ఊడలు దిగే దశనుండి కాయలు ఊరే దశవరకు అనగా విత్తిన 45 రోజుల నుండి 90 రోజుల వరకు పంట చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ దశలో నీరు సక్రమంగా తగుమోతాదులో పెట్టుకోవాలి. అలాగే నీటిని తుంపర్లు ద్వారా ఇస్తే 25 శాతం సాగునీటి ఆదాతో పాటు దిగుబడి పెరుగుతుంది.

రైతులు నీటి తడుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం తో పాటుగా పంటను నష్టపరిచే చీడపీడలను సకాలంలో గుర్తించి అరికట్టటం ద్వారా వేరుశనగలో మంచి దిగుడులు సాధించటం సాధ్యమౌతుంది.