Agnipath: 'అగ్నిప‌థ్‌' ఆందోళ‌న‌ల‌కు పిల్ల‌ల‌ను పంపారు: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ Children were sent for protests Anurag Thakur on Agnipath protests

Agnipath: ‘అగ్నిప‌థ్‌’ ఆందోళ‌న‌ల‌కు పిల్ల‌ల‌ను పంపారు: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్

అగ్నిప‌థ్‌పై కొంద‌రు రాజ‌కీయాలు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. పిల్ల‌ల‌ను నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు పంపుతున్నార‌ని అన్నారు. ఆ పిల్ల‌ల‌కు ప‌థ‌కం గురించి ఏం తెలుస‌ని ప్ర‌శ్నించారు. క్ర‌మ‌శిక్ష‌ణ ఉన్న వారు ఆర్మీ ఉద్యోగాలకు కావాల‌ని ఆయ‌న అన్నారు.

Agnipath: ‘అగ్నిప‌థ్‌’ ఆందోళ‌న‌ల‌కు పిల్ల‌ల‌ను పంపారు: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్

Agnipath: త్రివిధ ద‌ళాల సిబ్బంది నియామ‌కాల కోసం కేంద్ర స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన‌ అగ్నిప‌థ్ ప‌థ‌కం త‌మ‌కు న‌ష్టం చేకూర్చుతుంద‌ని ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేస్తూ హింస‌కు పాల్ప‌డుతుండ‌డం స‌రికాద‌ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ అన్నారు. ఆందోళ‌న‌కారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తుండ‌డాన్ని ఖండిస్తున్నాన‌ని చెప్పారు. యువ‌త త‌మ ఆందోళ‌న‌ల‌ను శాంతియుతంగా వారు ఎన్నుకున్న ప్ర‌జాప్ర‌తినిధుల ముందు తెల‌పాల‌ని ఆయ‌న కోరారు. ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తూ లేఖ‌లు రాయొచ్చ‌ని తెలిపారు.

Agnipath: అందుకే అగ్నిప‌థ్‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు: కేంద్ర మంత్రి నఖ్వీ

భారత ఆర్మీకి అగ్నిప‌థ్ ప‌థ‌కం ఎంతో మేలు చేస్తుంద‌ని ఆయ‌న అన్నారు. ఇప్ప‌టికే అగ్నివీర్‌లకు కేంద్ర సాయుధ పోలీసు బ‌ల‌గాల్లో 10 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించార‌ని చెప్పారు. అలాగే, రాష్ట్రాల్లోని ప‌లు శాఖ‌ల్లోనూ రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌ని ప‌లు రాష్ట్రాలు కూడా ప్ర‌క‌టించాయ‌ని తెలిపారు. అగ్నిప‌థ్‌పై కొంద‌రు రాజ‌కీయాలు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. పిల్ల‌ల‌ను నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు పంపుతున్నార‌ని అన్నారు. ఆ పిల్ల‌ల‌కు ప‌థ‌కం గురించి ఏం తెలుస‌ని ప్ర‌శ్నించారు. క్ర‌మ‌శిక్ష‌ణ ఉన్న వారు ఆర్మీ ఉద్యోగాలకు కావాల‌ని ఆయ‌న అన్నారు. విధ్వంసాలు సృష్టించ‌డం, హింస‌కు పాల్ప‌డ‌డం వంటి ఘ‌ట‌న‌ల‌కు ఖండిస్తున్నాన‌ని చెప్పారు. ఉద్యోగార్థుల‌ను కొంద‌రు త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని ఆరోపించారు.

×