Chiranjeevi : భోళా మూవీ వర్క్స్ కంప్లీట్.. అమెరికా వెకేషన్ టూర్‌కి చిరు..

భోళా శంకర్ సినిమా పనులు అన్ని పూర్తి చేసేసిన చిరంజీవి.. ఒక చిన్న హాలిడే ట్రిప్ కి అమెరికా పయనం అయ్యాడు.

Chiranjeevi : భోళా మూవీ వర్క్స్ కంప్లీట్.. అమెరికా వెకేషన్ టూర్‌కి చిరు..

Chiranjeevi completes Bholaa Shankar Works and Off to US vacation trip

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్.. ఇలా ఒక షూటింగ్ పూర్తి అవ్వగానే మరో సినిమాని పట్టాలు ఎక్కిస్తూ వచ్చాడు. నిన్ననే (జులై 6) భోళా శంకర్ సంబంధించిన డబ్బింగ్ వర్క్ పూర్తి చేసి తన వర్క్ మొత్తం ఫినిష్ చేసేశాడు. ఆగష్టు 11న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టడానికి కంటే ముందు చిరు ఒక హాలీడే ట్రిప్ ని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే నేడు అమెరికా పయనం అయ్యాడు.

Naga Shaurya : నాగశౌర్య ఆ గేమ్‌లో నేషనల్ ప్లేయర్ తెలుసా? ఇంటర్నేషనల్స్ కి కూడా ట్రై చేశాడు కానీ..

ఈరోజు సతీమణి సురేఖతో కలిసి చిరు అమెరికాకు చిన్న హాలిడే ట్రిప్ కి బయలుదేరాడు. ఆ విషయాన్ని చిరు తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఫ్లైట్ లోని ఫోటోలను షేర్ చేస్తూ.. “నా తదుపరి సినిమా మొదలు పెట్టడానికి ముందు ఒక చిన్న హాలిడే ట్రిప్ కి వెళ్లి రిఫ్రెష్ అయ్యి వస్తాను” అంటూ చిరు పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక భోళా శంకర్ విషయానికి వస్తే.. మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’కి ఇది రీమేక్ గా వస్తుంది.

త‌మ‌న్నా (Tamannaah) హీరోయిన్ గా నటిస్తుండగా మరో భామ కీర్తి సురేష్ (Keerthy Suresh) చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించబోతుంది. అక్కినేని హీరో సుశాంత్ కీర్తికి జోడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమా తరువాత వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి.