Chiranjeevi : ఆయన నా సీనియర్.. ఆయనతో సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు..

ప్రీ రిలీజ్‌ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. ''గోపీచంద్‌ నాన్నగారు టి.కృష్ణ అద్భుతమైన దర్శకుడు. ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నాకు ఆయన సీనియర్‌. నా కెరీర్ ఆరంభంలో నాలోని భయాన్ని............

Chiranjeevi : ఆయన నా సీనియర్.. ఆయనతో సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు..

Chiranjeevi

Chiranjeevi :  గోపీచంద్, రాశిఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పక్కా కమర్షియల్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌– యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు, వంశీ నిర్మించిన ఈ సినిమా జూలై 1న థియేటర్స్ లోకి రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు.

Shahrukh Khan : 2023లో బాద్‌షా కంబ్యాక్..

ప్రీ రిలీజ్‌ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. ”గోపీచంద్‌ నాన్నగారు టి.కృష్ణ అద్భుతమైన దర్శకుడు. ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నాకు ఆయన సీనియర్‌. నా కెరీర్ ఆరంభంలో నాలోని భయాన్ని పోగొట్టి సపోర్ట్ చేశారు ఆయన. అందుకే టి.కృష్ణ గారు నాకు ఒక హీరోలాగా కనిపిస్తుంటారు. ఆయన లేకున్నా ఇప్పుడు ఇండస్ట్రీపై తన ప్రేమను గోపీచంద్‌ ద్వారా కురుపిస్తున్నారు. ఆయనతో నేను ఒక సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. గోపీచంద్‌ సినిమాల్లో నాకు ‘సాహసం’ బాగా నచ్చింది. కొన్ని సినిమాలతో కమర్షియల్‌ హీరోగా కూడా ఎదిగాడు గోపీచంద్. మారుతి సినిమాల్లో ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే సినిమాలు నాకు బాగా నచ్చాయి. ‘పక్కా కమర్షియల్‌’ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.