Chiru – Mahesh : రిలీజ్ డేట్‌లు వాయిదా వేస్తున్న చిరు, మహేష్..

టాలీవుడ్ లో ఈ ఏడాది సినిమా జాతర జరగనుంది. మోస్ట్ అవైటెడ్ మూవీస్ అన్ని ఈ సంవత్సరం అభిమానులను పలకరించనున్నాయి. ఈ లిస్ట్ లోనే చిరంజీవి భోళాశంకర్, మహేష్ బాబు SSMB28 సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్స్ ని కూడా అనౌన్స్ నిర్మాతలు. కానీ ఇప్పుడు ఈ డేట్స్ చేంజ్ అయ్యినట్లు తెలుస్తుంది.

Chiru – Mahesh : రిలీజ్ డేట్‌లు వాయిదా వేస్తున్న చిరు, మహేష్..

Chiru - Mahesh

Chiru – Mahesh : టాలీవుడ్ లో ఈ ఏడాది సినిమా జాతర జరగనుంది. మోస్ట్ అవైటెడ్ మూవీస్ అన్ని ఈ సంవత్సరం అభిమానులను పలకరించనున్నాయి. ఈ లిస్ట్ లోనే చిరంజీవి భోళాశంకర్, మహేష్ బాబు SSMB28 సినిమాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాల రెగ్యులర్ షూట్ ఇటీవలే మొదలు పెట్టుకున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఈ మూవీ రిలీజ్ డేట్స్ ని కూడా అనౌన్స్ నిర్మాతలు.

Chiranjeevi : పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై నో కామెంట్స్ అంటున్న చిరంజీవి..

భోళాశంకర్ సినిమాని ఏప్రిల్ 14న, SSMB28 ఆగష్టు 11న రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ఇప్పుడు ఈ డేట్స్ చేంజ్ అయ్యినట్లు తెలుస్తుంది. భోళాశంకర్ రిలీజ్ డేట్ మే 12కు ఛేంజ్ కాబోతోందని ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అలాగే మహేష్ బాబు సినిమా కూడా ఆగష్టు 11 నుంచి అక్టోబర్‌ 18కు షిఫ్ట్ అయ్యినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారట. అయితే పోస్ట్‌పోన్ గల కారణాలు తెలియాల్సి ఉంది.

కాగా ఈ రెండు సినిమాలు పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాదిని ‘వాల్తేరు వీరయ్య’ లాంటి స్ట్రెయిట్ మూవీతో మొదలుపెట్టిన చిరు.. నెక్స్ట్ రీమేక్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తమిళంలో సూపర్ హిట్టు అయిన ‘వేదాళం’ సినిమాకి భోళాశంకర్ రీమేక్. సిస్టర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ చిత్రంలో చిరుకి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక SSMB28 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న మహేష్ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. మహేష్ సరసన పూజ హెగ్దే, శ్రీలీల హీరోయిన్ లు గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సారధి స్టూడియోలో జరుగుతుంది.