కరోనా ఇంజెక్షన్ ధర… 5వేల రూపాయలలోపే

  • Published By: venkaiahnaidu ,Published On : June 24, 2020 / 10:26 AM IST
కరోనా ఇంజెక్షన్ ధర… 5వేల రూపాయలలోపే

కరోనాకు మందు లేదు అని ఇన్నాళ్లూ అనుకున్నాం. కానీ ఇప్పుడు ఫాబిఫ్లూ (FabiFlu), కోవిఫోర్ (Covifor) వచ్చేశాయి. వీటికి తోడుగా ఇప్పుడు ఇండియన్ ఫార్మా కంపెనీ సిప్లా… సిప్రెమీ (Cipremi) పేరుతో మరో మందును తెచ్చింది. కోవిఫోర్‌ను హెటెరో ఫార్మా కంపెనీ… రెమ్‌డెసివిర్‌తో తయారుచేయగా… సిప్లా కూడా అదే రెమ్‌డెసివిర్‌తో… సిప్రెమీని తయారుచేసింది. ఇది కూడా కోవిఫోర్ లాగా… ఇంజెక్షన్ లాగే ఉంటుంది. 

అయితే,మరో వారం లేదా పది రోజుల్లో మార్కెట్లోకి రానున్న తమ కరోనా ఇంజక్షన్ 100 ఎంజీ  ధర ప్రపంచంలోనే అతి తక్కువని సిప్లా సంస్థ పేర్కొంది. దీని ధర రూ. 5 వేల కన్నా తక్కువగానే ఉంటుందని ప్రకటించింది. ఇప్పటికే దేశీయంగా ఈ డ్రగ్ ను విడుదల చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నుంచి సిప్లా అనుమతి పొందిందన్న సంగతి తెలిసిందే.

కాగా, తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న హెటిరో సంస్థ కూడా కరోనా ఇంజక్షన్ డ్రగ్ ను విడుదల చేసి, దీని ధర రూ. 5 వేల నుంచి రూ. 6 వేల మధ్య ఉంటుందని ప్రకటించగా, సిప్లా మాత్రం  అంతకన్నా తక్కువకే ఇంజక్షన్ ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించడం గమనార్హం.

COVID-19 సంక్రమణకు ‘సిప్రెమి’ అనే ఔషధం.. ఆసుపత్రిలో చేరిన పెద్దలు మరియు పీడియాట్రిక్ రోగుల కోసం  ఆమోదించబడింది. కరోనా వైరస్ సోకి అనారోగ్యానికి గురైన తర్వాత ఆక్సీజన్ సపోర్ట్ పై ఉన్నవారికి  కొత్తగా తీసుకొచ్చిన ఈ డ్రగ్  మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అమెరికాలో FDA… కరోనా పేషెంట్లకు రెమ్‌డెసివిర్‌ను కరోనాతో బాధపడుతున్న పెద్దవాళ్లకు, పిడియాట్రిక్ పేషెంట్లకు ఇవ్వొచ్చని అనుమతించింది. అందువల్ల ఇది కరోనాకి సరైన మందుగా ప్రస్తుతానికి భావిస్తున్నారు.

మన దేశంలో DCGI… సిప్లా డ్రగ్‌ను ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే వాడాలని చెప్పింది. అంటే… కరోనా అంతంతమాత్రంగా ఉండేవారికి సిప్రెమీ ఇవ్వకూడదన్నది ఉద్దేశం కావచ్చు. ఎందుకంటే… రెమ్‌డెసివిర్ అనేది చాలా పవర్‌ఫుల్ మందు కావడమే.