Nagaland : నాగాలాండ్ థిరు గ్రామంలో ఫుల్ టెన్షన్

ప్రజలు శాంతంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి నెఫియు రియో విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించొద్దంటూ సూచించారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించారు.

Nagaland : నాగాలాండ్ థిరు గ్రామంలో ఫుల్ టెన్షన్

Nagaland (1)

Nagaland Mon : మయన్మార్‌కు తూర్పు సరిహద్దు రాష్ట్రం..! ఈ ప్రాంతం గుండా చొరబాటుదారులు దేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తుంటారు. ఎవరు ఎప్పుడు వస్తారో తెలియని ప్రదేశం ఇది. ఇక్కడ భారత ఆర్మీ నిఘా నీడలో ఉంటుంది. పక్కా పోలీసు పెట్రోలింగ్ నిర్వహిస్తూ..చొరబాటుదారులను అడ్డుకొనే ప్రయత్నం చేస్తుంటారరు. నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో ఉన్న థిరు గ్రామంలో కూలీ పని చేసుకొనే వారు ఎందరో ఉంటారు. ఉదయం వెళ్లిన వీరు..కష్టం చేసుకుని..తిరిగి సొంతిళ్లకు వస్తుంటారు. ఎన్నో ఒడిదొడుకుల మధ్య వీరి జీవితం సాగుతుంటుంది. అయితే..ఒక్కసారిగా కలకలం రేగింది. చేయని పాపానికి ఆర్మీ చేసిన పొరపాటు..ఏకంగా 14 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇందులో ఒక జవాన్ కూడా ఉన్నారు. ఉగ్రవాదులు అనుకొని సాధారణ పౌరులపై భద్రతా దళాలు కాల్పులు జరపడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. తప్పుడు సమాచారంతో అమాయక ప్రజలను చంపేస్తారా? అని భద్రతా బలగాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈశాన్య భారతీయుల ప్రాణాలంటే లెక్క లేదా అని దుమ్మెత్తిపోస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగుతోంది.

Read More : Tirumala Ghat Roads : తిరుమల ఘాట్ రోడ్డును పరిశీలించిన కేరళ నిపుణుల బృందం

భద్రతా బలగాల అత్యుత్సాహంతో థిరు గ్రామం నివురు గప్పిన నిప్పులా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది. మోన్ జిల్లాలోని థిరు గ్రామంలో ఈ ఘటన తర్వాత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు హింసకు పాల్పడ్డారు. NSCN మిలిటెంట్లుగా పొరపాటుపడి అమాయక యువకులను పొట్టన పెట్టుకున్నారని ఆందోళనకు దిగారు. భద్రతా సిబ్బందికి చెందిన పలు వాహనాలకు నిప్పు పెట్టారు. రాళ్లు రువ్వారు. దీంతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా అదుపు తప్పాయి.

Read More : Ind Vs NZ : కివీస్ టార్గెట్ 540 పరుగులు…చెలరేగిన అక్షర్ పటేల్

ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. అదనపు బలగాలను తరలించింది. ప్రజలు శాంతంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి నెఫియు రియో విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించొద్దంటూ సూచించారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించారు. మృతుల్లో చాలా మంది బొగ్గు గనుల్లో పనిచేసే వారే ఉన్నారు. పనులు ముగించుకొని ఇళ్లకు వస్తున్న సమయంలో భద్రతాదళాలు కాల్పులు జరిపారు. థిరు వద్ద గల బొగ్గు గనుల్లో పని చేసే స్థానిక యువకులు.. తమ విధులను ముగించుకుని మినీ ట్రక్‌లో ఇళ్లకు బయలుదేరారు. మార్గమధ్యలో థిరు గ్రామం వద్ద భద్రత సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు.