ఆఖరి నిమిషంలో సీఎం జగన్ అనూహ్య నిర్ణయం.. ఢిల్లీ పర్యటన రద్దు

ఆఖరి నిమిషంలో సీఎం జగన్ అనూహ్య నిర్ణయం.. ఢిల్లీ పర్యటన రద్దు

cm jagan delhi tour cancel: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దైంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(మార్చి 3,2021) సాయంత్రం హస్తిన వెళ్లాల్సి ఉండగా, ఆఖరి నిమిషంలో టూర్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. ఓవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావుడిలో ఢిల్లీ పెద్దలు బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు ఏపీలోనూ మున్సిపల్ ఎన్నికల హడావుడి నడుస్తోంది. దీంతో జగన్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది.

మరోసారి ఢిల్లీకి వెళ్లానుకున్న జగన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కోరినట్టు సమాచారం. ఇద్దరు కీలక నేతలు కలిసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ఢిల్లీకి వెళ్లాలని అనుకున్నారు. మార్చిన 4న అమిత్ షా నేతృత్వంలో తిరుపతిలో సదరన్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఆ సమావేశం వాయిదా పడింది. ఆ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను అమిత్ షాను కలిసి విన్నవించుకోవాలని సీఎం జగన్ భావించారు. కానీ అమిత్ షా పర్యటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఏపీ సీఎంవో కోరినట్లు తెలుస్తోంది.

గత జనవరిలో హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయ్యారు. అప్పటి హస్తిన పర్యటనలో ఇరువురి మధ్య చాలా విషయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా ఆలయాలపై దాడులు, జమిలి ఎన్నికలు తదితర అంశాలను చర్చించినట్టు తెలిసింది. సడెన్ గా ఇప్పుడు సీఎం జగన్ మరోసారి ఢిల్లీ టూర్ వెనుక… కారణాలు ఏమై ఉంటాయన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయ ఎజెండానా లేక రాష్ట్ర ఆర్థిక అంశాలపై చర్చిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే చివరి నిమిషంలో సీఎం జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు.