CM Jagan : 2024 ఎన్నికలపై జగన్ ఫోకస్.. పార్టీ నేతలతో కీలక సమావేశం

ఏపీ సీఎం జగన్ 2024 ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.

CM Jagan : 2024 ఎన్నికలపై జగన్ ఫోకస్.. పార్టీ నేతలతో కీలక సమావేశం

Cm Jagan (1)

CM Jagan : ఏపీ సీఎం జగన్ 2024 ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లతో జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పూర్తిగా పార్టీపైన ఫోకస్ పెట్టేలా సూచనలు చేయనున్నారు.

జిల్లా స్తాయి నుంచి గ్రామ స్తాయి వరకు కమిటీల నియామకంపై సీఎం జగన్ సూచనలు చేసే అవకాశం ఉంది. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తూనే మరింతగా జనంలోకి వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారు జగన్. వీటితో పాటు పార్టీలో విబేధాలు, వివాదాలను పరిష్కరించే పనిలో పడ్డారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్ సమావేశం కీలకమైనదిగా చెప్పవచ్చు. పార్టీపై పూర్తి స్తాయిలో ఫోకస్ పెట్టిన జగన్.. మొదటి విడతలో భాగంగా జిల్లాల వారీగా సమీక్షలు ఇప్పటికే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీని మరింత పటిష్టం చేసే విధంగా సీఎం జగన్ చర్యలు చేపట్టారు.

Nara Chandrababu Naidu : ఏపీలో శ్రీలంక పరిస్ధితులే కనిపిస్తున్నాయి, ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రకటించాల్సిందే-చంద్రబాబు

ప్రధానంగా జిల్లాల వారీగా పార్టీలో నెలకొన్న విబేధాలు, వివాదాలపైనా జగన్ ఫోకస్ పెట్టారు. దీనిపై స్వయంగా రంగంలోకి దిగిన పరిష్కరించే పనిలో జగన్ ఉన్నారు. తాజా సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేయనున్న జగన్.. వారికి కీలక ఆదేశాలు ఇవ్వనున్నారని సమాచారం. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లకు పార్టీ పూర్తి స్తాయి బాధ్యతలను జగన్ అప్పగించడం జరిగింది.