CM KCR : వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే

వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ పర్యవేక్షించనున్నారు. భద్రాచలం, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో పరిస్థితిపై సీఎం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.

CM KCR : వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే

Kcr Arial Survey (1)

CM KCR : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ముఖ్యంగా భద్రాచలం జల విలయంలో చిక్కుకుంది. భద్రాచలం వద్ద గోదావరి 71.30 అడుగుల మేర ప్రవహిస్తోంది. భద్రాచలం, పరిసర ప్రాంతాలకు వరద ముంపు పొంచివుంది. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ పర్యవేక్షించనున్నారు. భద్రాచలం, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో పరిస్థితిపై సీఎం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.

వరదలతో జలమయమవుతున్న లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆర్‌ఎఫ్‌, రెస్క్యూ బృందాలు సహా… హెలికాప్టర్‌ను భద్రాచలానికి తరలించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

CM KCR : సహాయక చర్యల కోసం భద్రాచలానికి హెలికాప్టర్‌ : సీఎం కేసీఆర్‌

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. మరోవైపు భద్రాచలంలో క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను మంత్రి పువ్వాడ అజయ్‌ పరిశీలిస్తున్నారు. వరద బాధితులను రక్షించేందుకు లైఫ్‌ జాకెట్లు, తదితర రక్షణ సామాగ్రిని తరలించాలని ఆదేశించారు. ఇప్పటికే వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మరోవైపు భద్రాద్రి కలెక్టర్‌, ఎస్పీ, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నీటిపారుదలశాఖ అధికారులు టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. భద్రాలచంలో కొనసాగుతున్న వరదలు, సహాయ, పునరావాస చర్యలపై సమీక్షించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, సింగరేణి, రెస్క్యూ బృందాలను బృందాలను భద్రాచలం, కొత్తగూడెంలో అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు.