CM KCR : సహాయక చర్యల కోసం భద్రాచలానికి హెలికాప్టర్‌ : సీఎం కేసీఆర్‌

రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆర్‌ఎఫ్‌, రెస్క్యూ బృందాలు సహా... హెలికాప్టర్‌ను భద్రాచలానికి తరలించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

CM KCR : సహాయక చర్యల కోసం భద్రాచలానికి హెలికాప్టర్‌ : సీఎం కేసీఆర్‌

Cm Kcr

CM KCR ordered : భద్రాద్రి తీరం ప్రళయ గోదావరిని తలపిస్తోంది. సుడులు తిరుగుతూ మహోగ్రరూపం దాల్చిన గోదారమ్మ… భద్రాచలం తీరప్రాంత వాసులను కలవరపెడుతోంది. ఊహించని రీతిలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రవాహం… తీరప్రాంతాలను అల్లకల్లోలం చేస్తోంది. గోదారమ్మ ఏ కోశానా శాంతించేలా కన్పించకపోవడంతో అటు అధికార యంత్రాంగం, ఇటు జనాలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే భద్రాద్రి వద్ద గోదావరి వరద నీటిమట్టం 72 అడుగులకు చేరింది. ప్రస్తుతం ఎగువ నుంచి గోదావరిలోకి 24 లక్షల 39వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. దీంతో మరికొద్ది గంటల్లో అదికాస్తా 75అడుగులకు చేరే అవకాశం ఉంది. సాయంత్రానికి 80అడుగులు చేరుకునే అవకాశం ఉండటంతో భద్రాద్రి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పరీవాహక ప్రాంతంలో గోదావరి వరద ఉద్ధృతికి 95 గ్రామాలు నీటమునిగాయి. 77 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6వేల 155 కుటుంబాలకు చెందిన 20వేల 922 మందిని ఈ కేంద్రాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపు తీవ్రత రెట్టింపయింది. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందల గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయి. సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. 200 గ్రామాలకు మండల కేంద్రాలతో సంబంధాలు తెగిపోయాయి. వరదలతో జలమయమవుతున్న లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

Godavari Floods: భ‌యం గుప్పిట్లో భ‌ద్రాద్రి.. 71.30 అడుగుల‌కు చేరిన గోదావ‌రి నీటిమ‌ట్టం..

రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆర్‌ఎఫ్‌, రెస్క్యూ బృందాలు సహా… హెలికాప్టర్‌ను భద్రాచలానికి తరలించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. మరోవైపు భద్రాచలంలో క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను మంత్రి పువ్వాడ అజయ్‌ పరిశీలిస్తున్నారు. వరద బాధితులను రక్షించేందుకు లైఫ్‌ జాకెట్లు, తదితర రక్షణ సామాగ్రిని తరలించాలని ఆదేశించారు. ఇప్పటికే వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మరోవైపు భద్రాద్రి కలెక్టర్‌, ఎస్పీ, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నీటిపారుదలశాఖ అధికారులు టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. భద్రాలచంలో కొనసాగుతున్న వరదలు, సహాయ, పునరావాస చర్యలపై సమీక్షించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, సింగరేణి, రెస్క్యూ బృందాలను బృందాలను భద్రాచలం, కొత్తగూడెంలో అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు.