Godavari Floods: భ‌యం గుప్పిట్లో భ‌ద్రాద్రి.. 71.30 అడుగుల‌కు చేరిన గోదావ‌రి నీటిమ‌ట్టం..

గోదావ‌రి ఉగ్ర‌రూపానికి భ‌ద్రాచ‌లం చిగురుటాకుల వ‌ణికిపోతోంది. మూడు ద‌శాబ్దాల త‌ర్వాత గ‌రిష్టంగా పోటెత్తిన వ‌ర‌ద ప్ర‌వాహం ప్ర‌ళ‌యాన్ని త‌ల‌పించింది. భ‌ద్రాచ‌లం వ‌ద్ద 32 ఏళ్ల త‌ర్వాత నీటిమ‌ట్టం 70అడుగులు దాటింది. శ‌నివారం ఉద‌యం 7గంట‌ల స‌మ‌యం వ‌ర‌కు అధికారికంగా గోదావ‌రి నీటిమ‌ట్టం 71.30 అడుగుల‌కు చేరింది.

Godavari Floods: భ‌యం గుప్పిట్లో భ‌ద్రాద్రి.. 71.30 అడుగుల‌కు చేరిన గోదావ‌రి నీటిమ‌ట్టం..

Godavari Flood

Godavari Floods: గోదావ‌రి ఉగ్ర‌రూపానికి భ‌ద్రాచ‌లం చిగురుటాకుల వ‌ణికిపోతోంది. మూడు ద‌శాబ్దాల త‌ర్వాత గ‌రిష్టంగా పోటెత్తిన వ‌ర‌ద ప్ర‌వాహం ప్ర‌ళ‌యాన్ని త‌ల‌పించింది. భ‌ద్రాచ‌లం వ‌ద్ద 32 ఏళ్ల త‌ర్వాత నీటిమ‌ట్టం 70అడుగులు దాటింది. శ‌నివారం ఉద‌యం 7గంట‌ల స‌మ‌యం వ‌ర‌కు అధికారికంగా గోదావ‌రి నీటిమ‌ట్టం 71.30 అడుగుల‌కు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతుండ‌టంతో మ‌రికొద్ది గంట‌ల్లో 75 అడుగుల‌కు సైతం గోదావ‌రి నీటిమ‌ట్టం చేరే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

Godavari Flood Water : జలదిగ్బంధంలో భద్రాచలం..రామయ్య ఆలయాన్ని చుట్టుముట్టిన ఉగ్ర గోదావరి

గంట‌గంట‌కు పెరుగుతున్న గోదావరి నీటిమ‌ట్టంతో ముంపు ప్రాంతాల వాసులు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. అధికార లెక్కల ప్రకారం.. అరరాత్రి 1 నుండి 4 గంటల వరకు 71.30 అడుగుల‌కు గోదావ‌రి నీటి మ‌ట్టం చేరింది. ప్ర‌స్తుతం 24,38872 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీరు దిగువకు వ‌దులుతున్నారు. తెలంగాణ – ఆంధ్ర సరిహద్దు భ‌ద్రాచ‌లం శివారు ప్రాంతం ఏటపాక వద్ద గోదావరి కరకట్ట పై వ‌ర‌ద‌నీరు ప్ర‌వ‌హిస్తుంది. గోదావ‌రి మ‌హోగ్ర రూపానికి భ‌ద్రాచ‌లం ప‌రిస‌ర ప్రాంతాల్లోని ఏడు మండ‌లాలు నీట మునిగాయి. 95 గ్రామాల‌ను అధికారులు ఖాళీ చేయించారు. 6,155 కుటుంభాలు, 20922 మంది ప్రజలను 77 పున‌రావాస కేంద్రాల్లో ఉంచారు.

Godavari Flood : గోదావరి ఉగ్రరూపం..డేంజర్ జోన్ లో భద్రాచలం

శుక్ర‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌రువాత వ‌ర‌ద నిల‌క‌డ‌గా మారుతుంద‌ని ప్ర‌చారం సాగిన‌ప్ప‌టికీ లోత‌ట్టు ప్రాంతాల్లో ముంపు తీవ్రత‌ రెట్టింప‌యింది. ఏడు ముంపు మండ‌లాలు జ‌ల‌దిగ్భందంలోకి వెళ్లిపోయాయి. దుమ్ముగూడెం, చ‌ర్ల మండ‌లాల్లోని ముంపు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నీట మునిగి స‌ర‌ఫ‌రా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో స‌మాచార వ్య‌వ‌స్థ‌ల‌న్నీ స్తంభించిపోయాయి. గోదావ‌రి ప్ర‌వాహం ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేర‌డంతో వ‌ర‌ద ప‌రిస్థితిని నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తూ స‌హాయ‌క చ‌ర్య‌లకోసం కావాల్సిన ప‌రిక‌రాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం అందిస్తుంది. శుక్ర‌వారం హెలికాప్ట‌ర్ ను పంపించింది. అదేవిధంగా భ‌ద్రాచ‌లానికి 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీకి చెందిన ఐదు బృందాలు, సింగ‌రేణి రెస్క్యూ టీంలు చేరుకున్నాయి. మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ భ‌ద్రాచ‌లంలోని ఉండి వ‌ర‌ద ఉధృతిని ఎప్ప‌టిక‌ప్పుడు అంచ‌నావేస్తూ లోత‌ట్టు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Godavari Floods: భయం గుప్పిట్లో భద్రాద్రి.. 50ఏళ్ల రికార్డు బ్రేక్ అవుతుందా..!

భ‌ద్రాచ‌లం ప‌ట్ట‌ణంలోని ప‌లు కాల‌నీల్లోకి వ‌ర‌ద నీరు చేరింది. అయితే భ‌ద్రాచ‌లం ప‌ట్ణ‌ణంకు క‌ర‌క‌ట్ట ర‌క్ష‌ణ‌గా నిలుస్తుంది. క‌ర‌క‌ట్ట ఉండ‌టంతో 80అడుగుల వ‌ర‌కు భ‌ద్రాచ‌లం ప‌ట్ట‌ణంలోకి వ‌ర‌ద నీరు చేరే అవ‌కాశం ఉండ‌ద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం వ‌ర‌ద ఉధృతి ఈ విధంగానే కొన‌సాగితే గోదావ‌రి నీటిమ‌ట్టం 75 అడుగులు దాటే అవ‌కాశం ఉంద‌ని, 80 అడుగుల‌కు చేరే అవ‌కాశాలు చాలా త‌క్కువ అని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఇక‌వేళ 80 అడుగుల వ‌ద్ద‌కు గోదావ‌రి నీటిమ‌ట్టం చేరినా ఎదుర్కొనేందుకు అధికారులు పూర్తిస్థాయిలో స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.