Godavari Flood : గోదావరి ఉగ్రరూపం..డేంజర్ జోన్ లో భద్రాచలం

కరకట్టకు 5 అడుగుల దిగువలో గోదావరి ప్రవహించనుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 24 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. రాత్రికి 30లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరింత వరద పెరిగితే కష్టమని అధికారులు అంటున్నారు.

Godavari Flood : గోదావరి ఉగ్రరూపం..డేంజర్ జోన్ లో భద్రాచలం

Bhadrachalam

Godavari flood water : భద్రాచలం డేంజర్ జోన్ లో ఉంది. భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలానికి 10 అడుగుల దూరంలో ప్రమాదం ఉంది. భద్రాచలం కరకట్ట ఎత్తు 80 అడుగులు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 70 అడుగులు దాటింది. రాత్రికి నీటి మట్టం 75 అడుగులకు చేరుతుందని అధికారుల అంచనా. 24 గంటల్లో 75 నుంచి 80 అడుగులకు చేరే అవకాశం ఉంది. దిగువకు 22,79,632 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. భద్రాచలం బ్రిడ్జీ పైనుంచి వరద నీరు పారే అవకాశం ఉంది.

కరకట్టకు 5 అడుగుల దిగువలో గోదావరి ప్రవహించనుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 24 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. రాత్రికి 30లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరింత వరద పెరిగితే కష్టమని అధికారులు అంటున్నారు. ఇప్పటికే సీతారామచంద్రస్వామి ఆలయం ముందుకు వరద నీరు వచ్చి చేరింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Telangana : పెరుగుతున్న గోదావరి ఉధృతి..భద్రాచలం,బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్

తెలంగాణ ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది. కాసేపట్లో మిలటరీ హెలికాప్టర్ కొత్తగూడెం చేరుకోనుంది. మిలటరీ బోట్స్, 300 లైఫ్ జాకెట్లు, సహాయక చర్యలను కల్నల్ స్థాయి అధికారి పర్యవేక్షించనున్నారు. పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తోన్నారు. భద్రాచలంలో 48 గంటలపాటు ఆంక్షలు అమలులో ఉంటాయి.

62 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. 2 వేల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు.