Godavari Flood Water : జలదిగ్బంధంలో భద్రాచలం..రామయ్య ఆలయాన్ని చుట్టుముట్టిన ఉగ్ర గోదావరి
ఎగువ నుంచి వస్తున్న వరదతో.. గోదావరికి భారీగా వరద పోటెత్తుతోంది. అటు.. రామయ్య ఆలయాన్ని ఉగ్ర గోదారి చుట్టుముట్టింది. 1986 గోదావరి వరదల తర్వాత.. 36 సంవత్సరాల తర్వాత భారీ స్థాయిలో గోదావరికి వరదలు ఈ ఏడాది వచ్చాయి.

Bhadrachalam Ramayya
Godavari Flood Water : భద్రాచలం వాసుల్ని గోదారి భయపెడుతోంది. ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న గోదావరి ప్రవాహంతో.. భద్రాచలం, పరిసర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం మూడు వైపులా రహదారులు బంద్ అయ్యాయి. ప్రస్తుతం 70 అడుగులకు గోదావరి ప్రవాహం చేరి ప్రవహిస్తోంది. సాయంత్రానికి మరింత పెరిగి.. 75 అడుగులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో.. గోదావరికి భారీగా వరద పోటెత్తుతోంది. అటు.. రామయ్య ఆలయాన్ని ఉగ్ర గోదారి చుట్టుముట్టింది. 1986 గోదావరి వరదల తర్వాత.. 36 సంవత్సరాల తర్వాత భారీ స్థాయిలో గోదావరికి వరదలు ఈ ఏడాది వచ్చాయి.
భద్రాచలానికి ప్రమాదం 10అడుగుల దూరంలో ఉంది. అంతకంతకు పెరుగుతున్న గోదావరి నీటిమట్టంతో.. భద్రాచలం ఉనికి ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం పొంచి ఉంది. గోదావరి వరద ప్రవాహం నుంచి భద్రాచలాన్ని కాపాడేందుకు 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్.. 80 అడుగుల ఎత్తులో కరకట్ట నిర్మించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 70అడుగులకు పైగా ప్రవహిస్తోంది. రాత్రికి అది 75 అడుగులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. భద్రాచలం వంతెనపై నుంచి వరద పారుతుంది.
Godavari Flood : గోదావరి ఉగ్రరూపం..డేంజర్ జోన్ లో భద్రాచలం
ఆ సమయంలో కరకట్టకు కేవలం ఐదు అడుగుల దిగువలో వరద ప్రవహిస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం ఆర్మీ సహాయాన్ని కోరింది. కాసేపట్లో ఆర్మీ హెలికాఫ్టర్ కొత్తగూడెంకు చేరుకోనుంది. అలాగే ఆర్మీ బోట్స్, 300లకు పైగా లైఫ్ జాకెట్స్ చేరుకుంటాయి. కల్నల్ స్థాయి అధికారి సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు.
మంత్రి పువ్వాడ అజయ్.. భద్రాచలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 24లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. రాత్రికి అది 30లక్షలకు పైగా చేరుకుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గోదావరి వరద సీతారామచంద్రస్వామి ఆలయం ముందుకు చేరింది. మరింత వరద పెరిగితే పరిస్థితి చేజారే ప్రమాదముందని అధికారులు అంటున్నారు.