CM KCR: కంటతడి పెట్టిన కేసీఆర్.. సాయిచంద్ భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం
సాయి చంద్ భార్య, పిల్లలు సీఎం కేసీఆర్ కాళ్ల మీద పడి బోరున విలపించారు. భావోద్వేగానికి గురైన సీఎం కేసీఆర్ కంటతడి పెట్టుకున్నారు.

Sai Chand Passed Away
TSWC Chairman Sai Chand: ప్రముఖ గాయకుడు, తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ (TSWC Chairman) సాయిచంద్ గురువారం తెల్లవారు జామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన భౌతికకాయాన్ని రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో ఉన్న స్వగృహానికి తరలించారు. గురువారం మధ్యాహ్నం సాయిచంద్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. గుర్రంగూడలో ఉంచిన సాయి చంద్ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు, పలు వర్గాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గుర్రంగూడకు చేరుకొని సాయి చంద్ భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Sai Chand Passed Away: సాయిచంద్‌ను తెలంగాణ సమాజం మరువదు.. ప్రముఖుల ఘన నివాళి
ఈ క్రమంలో సాయి చంద్ భార్య, పిల్లలు సీఎం కేసీఆర్ కాళ్ల మీద పడి బోరున విలపించారు. భావోద్వేగానికి గురైన సీఎం కేసీఆర్ కంటతడి పెట్టుకున్నారు. ఏడుస్తున్న సాయిచంద్ భార్యను సీఎం కేసీఆర్ ఓదార్చారు. అక్కడే ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం సాయి చంద్ తండ్రిని సీఎం కేసీఆర్ ఓదార్చారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ తో పాలు పలువురు నివాళులర్పించారు. ఇదిలాఉంటే వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ స్మశాన వాటికలో సాయి చంద్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుర్రంగూడ నుంచి సాయిచంద్ అంతిమయాత్ర కొనసాగుతుంది.
Saichand Passed Away : తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం
ఉదయాన్నే సాయిచంద్ మృతివార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని, కళాకారున్ని కోల్పోయిందని అన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని, మరింత ఉన్నత స్థాయికి ఎదిగే దశలో ఆయన అకాల మరణం తనకు ఎంతో బాధను కలిగించిందని చెప్పారు.