CM Stalin : మహిళా ఎస్ఐపై సీఎం స్టాలిన్ ప్రశంసలు

అపస్మారకస్థితిలో పడి ఉన్న ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ రాజేశ్వరిను సీఎం స్టాలిన్ ప్రశంసలతో ముంచెత్తారు. అభినందించి..ప్రశంసాపత్రం అందించారు.

CM Stalin : మహిళా ఎస్ఐపై సీఎం స్టాలిన్ ప్రశంసలు

Stalin

Inspector E. Rajeswari : అపస్మారకస్థితిలో పడి ఉన్న ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన సబ్ ఇన్స్ పెక్టర్ రాజేశ్వరిను సీఎం స్టాలిన్ ప్రశంసలతో ముంచెత్తారు. అభినందించి..ప్రశంసాపత్రం అందించారు. ఎస్ఐ స్పందించిన తీరు..మానవతా దృక్పథం సీఎంను ఆకట్టుకుంది. ఆమెను స్వయంగా..తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. మనస్పూర్తిగా అభినందిస్తూ…ప్రశంసాపత్రం అందచేశారు. ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారంటూ..ఎస్ఐ రాజేశ్వరిని కొనియాడారు. అంతకుముందు…చెన్నై నగర పోలీస్ కమిషనర్ కూడా ఈ విషయంలో స్పందించారు. ఎస్ఐ రాజేశ్వరి సేవల పట్ల కితాబునిచ్చారు. ఆమె అద్భుతమైన అధికారి అంటూ..వెల్లడించారు. ఎస్ఐ రాజేశ్వరిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రశంసించారు.

చెన్నై నగరంలో వర్షాలు ఎలా కురస్తున్నాయో అందరికీ తెలిసింది. భారీ వర్షాలు, వరదలతో చెన్నై నగరం చిగుటాకులా వణికిపోయింది. ఎక్కడ చూసినా నీరే కనిపించింది. నడుంలోతు నీళ్లు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది చనిపోయారు. ఇలాగే..ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజేశ్వరి అక్కడకు చేరుకున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా..స్వయంగా..ఆ వ్యక్తిని భుజాన వేసుకున్నారు.

అక్కడనే ఉన్న కారులో తరలించేందుకు ప్రయత్నించారు. కానీ..అది వీలు కాలేదు. చివరగా..ఆటో తరలించడానికి పరుగు పరుగున వెళ్లారు ఎస్ఐ రాజేశ్వరి. కనీసం చెప్పులు లేకుండా..వర్షంలో ఆ వ్యక్తిని భుజన వేసుకుని పరుగులు తీసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తుపాను సహాయక చర్యల్లో సృహ కోల్పోయిన వ్యక్తిని తన భుజంపై వేసుకొని ఆటోలో ఆసుపత్రికి తరలించి ఎందరికో మార్గదర్శిగా నిలిచారంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు.