Coffee Cultivation Techniques : కాఫీ సాగులో మేలైన యాజమాన్యం

విశాఖపట్నం జిల్లాలోని తూర్పుకనుమల్లో... అరకు, పాడేరు ఏజన్సీ ప్రాంతాలు కాఫీ సాగుకు అనుకూలంగా వుండటంతో 1960వ దశకం నుంచి గిరిజనులు కాఫీని సాగుచేస్తున్నారు. కానీ ఇటీవలి కాలంలో ఇక్కడపండే కాఫీకి వాణిజ్య విలువ పెరగటంతో రైతులు సాగుపట్ల అధిక ఆసక్తిచూపుతున్నారు.

Coffee Cultivation Techniques : కాఫీ సాగులో మేలైన యాజమాన్యం

Coffee Cultivation Techniques

Coffee Cultivation Techniques : కాఫీ సాగుకు దక్షిణ భారతదేశం ప్రసిద్ధి. కాఫీతోటల విస్తీర్ణంతో కర్నాటక అగ్రస్థానంలో వుండగా… కేరళ, తమిళనాడు రాష్ట్రాలు రెండు, మూడు స్థానాల్లో వున్నాయి. దేశవ్యాప్తంగా లభించే కాఫీ ఉత్పత్తిలో 60 శాతం కర్నాటక నుంచే వస్తుండటం విశేషం.  ఆంధ్రప్రదేశ్  లోని విశాఖ ఏజన్సీలో గత 5 దశాబ్ధాలుగా కాఫీ తోటలు సాగవుతున్నాయి. ఇక్కడ పండే కాఫీ గింజల్లో నాణ్యత, సువాసన అధికంగా ఉండటంతో దేశీయంగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఇక్కడి రైతులు సరైన దిగుబడులను మాత్రం తీయలేకపోతున్నారు. సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడిని పొందవచ్చని కాఫీపొడి రేంజ్ ఆఫీసర్ శ్రీరమణ తెలియజేస్తున్నారు.

READ ALSO : Pepper Cultivation : విశాఖ మన్యంలో అదాయవనరుగా మిరియాల సాగు

కాఫీ అనగానే దక్షిణ భారతదేశమే గుర్తొస్తుంది. ప్రధానంగా కాఫీ ఉత్పత్తిలోను, విస్తీర్ణంలోను కర్నాటక రాష్ట్రానిదే హవా… ఆంధ్రప్రదేశ్ లో కాఫీ సాగుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి.. విశాఖ పట్నం, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాలోని మన్య ప్రాంతాతలకు పరిమితమైనది. ముఖ్యంగా విశాఖ ఏజన్సీ ప్రాంతంలో  గత 5 దశాబ్ధాలుగా కాఫీ సాగులో వున్నా… గిరిజనులకు సాగుపై సరైన అవగాహన, తగిన ప్రోత్సాహం లేకపోవటంతో దీని ఉనికి నామమాత్రంగానే వుంది.

సాధారణంగా కాఫీ తోటల పెరుగుదలకు ప్రత్యేక పరిస్థితులు వుండాలి. సముద్రమట్టం కంటే వెయ్యి నుంచి 2 వేల అడుగుల ఎత్తైన కొండవాలు ప్రదేశాలు దీనికి అనుకూలం. సకాలంలో వర్షాలు, 25 నుంచి 30డిగ్రీలకు మించని ఉష్ణోగ్రత వున్న ప్రదేశాల్లో కాఫీ పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది. కాఫీ చెట్లకు నీడ వాతావరణం తప్పనిసరిగా వుండాలి. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని పశ్ఛిమ కనుమ పర్వత ప్రాంతాలు ఇందుకు అనుకూలమైనవి కావటంతో సహజంగానే అక్కడ కాఫీతోటలు విస్తరించాయి.

READ ALSO : Araku coffee : అరకు కాఫీకి బలే గిరాకీ…

ఇదేవిధంగా విశాఖపట్నం జిల్లాలోని తూర్పుకనుమల్లో… అరకు, పాడేరు ఏజన్సీ ప్రాంతాలు కాఫీ సాగుకు అనుకూలంగా వుండటంతో 1960వ దశకం నుంచి గిరిజనులు కాఫీని సాగుచేస్తున్నారు. కానీ ఇటీవలి కాలంలో ఇక్కడపండే కాఫీకి వాణిజ్య విలువ పెరగటంతో రైతులు సాగుపట్ల అధిక ఆసక్తిచూపుతున్నారు. కాఫీ సాగు, మార్కెటింగ్ లో ఐటిడిఎ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. నీడ వాతావరణం వుండాలి కనుక సిల్వర్ ఓక్ చెట్ల మధ్యలో  కాఫీ విస్తీర్ణం అధికంగా వుంది. ఎకరానికి 1000 నుంచి 1300కాఫీ మొక్కలు వచ్చేటట్లు నాటి, సిల్వర్ ఓక్ చెట్లకు మిరియం పాకించటం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు.

ముఖ్యంగా చింతపల్లి ప్రాంతంలో అరాబికా , రొబస్లా రకాలను సాగుచేస్తూ ఉంటారు. నాటిన 5వ సంవత్సరం నుంచి రైతుకు దిగుబడి లభిస్తుంది. అయితే ప్రస్తుతం రెండో నారుమడి దశ. ఈ దశలో మొక్కలను జాగ్రత్తగా చూసుకుని  జులై నెలల్లో నాటుకోవాలి. డిసెంబరు నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో కాఫీగింజలు దిగుబడి ప్రారంభమవుతుంది. అధిక దిగుబడిని పొందాలంటే సరైన సమయంలో సరైన యాజమాన్యం చేపట్టాలని రైతులకు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా, చింతపల్లి కాఫీపొడి రేంజ్ ఆఫీసర్ శ్రీరమణ.

READ ALSO : ఫ్యాషన్ రాజధానిలో పాగా వేసిన అరకు కాఫీ 

నీడ తక్కువగల ప్రాంతాలలోని తోటల్లో  కాండం తొలుచు పురుకు ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ పురుగు ప్రధాన కాండం, దళసరి కొమ్మలను తొలచి లోపలికి పోయి , పోషక పదార్థాల సరఫరాకు అంతరాయం కలుగచేస్తుంది. అందువల్ల 7 నుండి 8 సంవత్సరాల లేత మొక్కలు చనిపోతాయి. కాబట్టి సకాలంలో  అంటే ఎప్రిల్, మే, అక్టోబర్ , నవంబర్ నెలల్లో ముందస్తుగా ఈ పురుగు నివారణకు చర్యలు చేపట్టాలి.