Cannes 2022 : ముగిసిన కాన్స్ ఫిలిం ఫెస్టివల్.. భారతీయ డాక్యుమెంటరీకి అవార్డు..

తాజాగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ముగిసింది. ఈ చలన చిత్రోత్సవాలలో ఫీచర్‌ ఫిల్మ్, షార్ట్‌ ఫిల్మ్, డాక్యుమెంటరీ విభాగాల్లో 21 అవార్డులు అందజేశారు. ఈ ఫిలిం ఫెస్టివల్ లో........

Cannes 2022 : ముగిసిన కాన్స్ ఫిలిం ఫెస్టివల్.. భారతీయ డాక్యుమెంటరీకి అవార్డు..

Cannes 2022 :  ఫ్రాన్స్‌లో ఘనంగా మొదలైన 75వ కాన్స్‌ చలన చిత్రోత్సవాలు ఆట్టహాసంగా ముగిశాయి. ఈ నెల 17న కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్ మొదలయిన సంగతి తెలిసిందే. ఈ ఫిలిం ఫెస్టివల్ కి ప్రపంచ వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు విచ్చేయగా భారతదేశం నుంచి కూడా చాలా మంది తారలు వెళ్లారు. రెడ్ కార్పెట్ పై తమ సరికొత్త ఫ్యాషన్ డ్రెస్సులతో నడిచి ఆ చిత్రోత్సవానికి మరింత అందాన్ని చేకూర్చారు భామలు.

తాజాగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ముగిసింది. ఈ చలన చిత్రోత్సవాలలో ఫీచర్‌ ఫిల్మ్, షార్ట్‌ ఫిల్మ్, డాక్యుమెంటరీ విభాగాల్లో 21 అవార్డులు అందజేశారు. ఈ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా పదుకొనే జ్యురి మెంబర్ గా ఉండటం, మన దేశానికి గౌరవ సభ్య దేశం హోదా కల్పించడం గర్వకారణం.

Sarkaru Vaari Paata : మహేష్ బాబు సినిమాను చూడకుండా ఎలా ఉండగలను.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్..

ఈ ఫిలిం ఫెస్టివల్ లో ఇండియాకు చెందిన డాక్యుమెంటరీ ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’కి అవార్డు రావడం విశేషం. 75వ కాన్స్‌ చలన చిత్రోత్సవాలకు భారతదేశం తరఫున ఎంపికైన ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’ డాక్యుమెంటరీకి ‘ది గోల్డెన్స్‌ ఐ’ అవార్డు దక్కింది. దీనికి షౌనక్‌ సేన్స్‌ దర్శకత్వం వహించారు. ఢిల్లీకి చెందిన మహ్మద్‌ సౌద్, నదీమ్‌ షెహజాద్‌ అనే ఇద్దరు అన్నదమ్ములు గాయపడ్డ పక్షులను ఎలా సంరక్షించేవారు? బ్లాక్‌కైట్స్‌ బర్డ్స్‌ సంరక్షణ కోసం వీరు ఏం చేశారు అనే కథాంశంతో ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’ డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించిన షౌనక్‌ సేన్స్‌ ని భారతీయ ప్రతినిధులు, పలువురు సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు.