Coriander Stalks : కొత్తిమీర కాడలు ఆరోగ్యానికి మంచిదే..!

కొత్తిమీరలో యాంటీబ్యాక్టీరియల్‌ ,యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. కొత్తిమీరలో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, కండరాల నొప్పి నుండి విముక్తి పొందవచ్చు.

Coriander Stalks : కొత్తిమీర కాడలు ఆరోగ్యానికి మంచిదే..!

Coriander Stalks

Coriander Stalks : ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలను ఆకుకూరలు అందిస్తాయి. ముఖ్యంగా కొత్తిమీర గురించి చెప్పుకుంటే.. కొత్తిమిర అన్ని వంటకాలలో ఉపయోగిస్తారు. కొత్తిమీర వాసన అద్భుతంగా ఉండటమే కాకుండా కొత్తిమీర వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొంతమంది కొత్తిమీర ఆకులను మాత్రమే వాడుకొని కాడలు పనికి రావని వాటిని పడేస్తుంటారు. అందులో ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయి. వాటివల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కొత్తిమీరలో విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. కొత్తిమీరలో పోషకాలు, బెషధ విలువలు అనేకం. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కొత్తిమీర మన శరీరంలో రక్తంలోని షుగర్‌ లెవెల్స్‌ ను కంట్రోల్‌ చేస్తుంది. ప్రతిరోజు ఉదయమే కొద్దిగా పచ్చి కొత్తిమీరను కడిగి తినటం వల్ల షుగర్‌ వ్యాధి సమస్య నుండి విముక్తి పొందవచ్చు.

Earwax : చెవులో గులిమి తొలగించుకునే చిట్కాలు

కొత్తిమీరలో యాంటీబ్యాక్టీరియల్‌ ,యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. కొత్తిమీరలో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, కండరాల నొప్పి నుండి విముక్తి పొందవచ్చు. కొత్తిమీర వల్ల కంటి చూపు సమస్యలు కూడా దూరమవుతాయి.

కొత్తిమీరలో ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి జీర్ణశక్తిని పెంచుతాయి. మెటబాలిజం పెరుగుతుంది. మలబద్దకం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. ఆకలి నియంత్రణలో ఉంటుంది. కొత్తిమీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా చాలా తోడ్పడుతుంది.

కొత్తిమీరలో యాంటీబ్యాక్టీరియల్‌ లక్షణాలు ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మొటిమల సమస్య కూడా తగ్గిస్తుంది.కనుక కొత్తిమీర కాడలలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కనుక వీటిని పడేస్తే మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతారు.

కొత్తి మీర కాడల్లో సిట్రోనెలోల్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో సూక్ష్మజీవుల పెరుగుదలతో పోరాడటానికి, అల్సర్ లకు చికిత్స చేసే గొప్ప క్రిమినాశకంగా ఉపయోగపడుతుంది. చర్మ సంరక్షణలో కొత్తి మీర కాడలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎండలో ఎక్కువగా తిరిగే వారి శరీరాన్ని ఇన్ ఫెక్షన్ల బారి నుండి కాపాడతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్ధాయిలను క్రమ బద్దీకరించటంలో దోహదపడతాయి.