Earwax : చెవులో గులిమి తొలగించుకునే చిట్కాలు

 హైడ్రోజ‌న్ పెరాక్సైడ్ మిశ్ర‌మాన్ని కూడా చెవుల‌ను క్లీన్ చేసేందుకు వాడ‌వ‌చ్చు. ఈ మిశ్ర‌మాన్ని కూడా 5 నుంచి 10 చుక్క‌ల మోతాదులో ఒక్కో చెవిలోనూ వేయాలి.

Earwax : చెవులో గులిమి తొలగించుకునే చిట్కాలు

Ear Wax

Earwax : చెవుల్లో గులిమి పేరుకుపోవ‌డం అన్న‌ది స‌ర్వ సాధార‌ణంగా జ‌రిగే విష‌య‌మే. నిజానికి గులిమి అనేది మన చెవి నుంచి సహజంగా వెలువడే మలిన పదార్థం. గులిమి తీసుకుంటూ చెవులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. మనలో చాలామంది అగ్గిపుల్లలకు దూది చుట్టి, పిన్నీసులు పెట్టి గులిమి తీసుకుంటూ ఉంటారు. ఈ పద్ధతుల వల్ల కొన్ని సందర్భాల్లో చెవుల్లోని సున్నిత మైన ప్రదేశాలకు ముప్పువాటిల్లే అవకాశం ఉంటుంది. చాలా మందిలో గులిమి ఎక్కువ‌గా త‌యారై ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే చెవుల్లో మాటిమాటికీ దుర‌ద‌గా అనిపిస్తుంటుంది. అయితే అలాంటి వారు కాట‌న్ బ‌డ్స్ తో గులిమి తీస్తుంటారు.

గులిమి చెవి లోపలి గ్రంథుల్లో ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. చెవులను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. చెవుల్లో ఉన్న నాళాలు ఎండిపోకుండా, పగుళ్లు రాకుండా కాపాడుతుంది. ధూళికణాలు, నీరు చెవిలోపలికి పోకుండా రక్షిస్తుంది. ఎలాంటి వ్యాధులూ సోకకుండా అరికడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు గుమిలిలో ఉంటాయి. మనం మాట్లాడుతున్నప్పుడు లేదా నములుతున్నప్పుడు దవడలు కదులుతాయి కదా, ఈ దవడల కదలికల వలన చెవి లోపల ఉన్న గులిమి మెల్లిమెల్లిగా కదులుతూ చెవి రంధ్రం ద్వారం బయటకు వచ్చేస్తుంది.

గులిమి బాగా ఎక్కువైతే, చెవులకు అవరోధంగా మారుతుంది. చెవి నొప్పి, వినికిడి తగ్గిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. చిటికెన వేలు చెవి లోపలికి దూర్చి గులిమి తీసుకుంటూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. దీనివలన అనేక సమస్యలు వస్తాయి. అయితే దూదితో శుభ్రం చేసుకోవడం ఇంకా ప్రమాదకరం. కానీ వాటికి బ‌దులుగా కింద తెలిపిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించ‌వ‌చ్చు. దీంతో గులిమిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీయ‌వ‌చ్చు.

ఒక చిన్న గ్లాస్‌లో 60 ఎంఎల్ మోతాదులో గోరు వెచ్చ‌ని నీటిని తీసుకోవాలి. అందులో అర టీస్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత డ్రాప‌ర్ స‌హాయంతో ఒక్కో చెవిలో 5 నుంచి 10 చుక్క‌లు ఆ మిశ్ర‌మాన్ని వేయాలి. అనంత‌రం ఒక గంట సేపు అయ్యాక శుభ్ర‌మైన నీళ్ల‌తో చెవుల‌ను క‌డిగేయాలి. ఇలా 2 రోజుల‌కు ఒక‌సారి చేయాలి. చెవి మొత్తం శుభ్రం అయిందని అనుకునే వ‌ర‌కు 2 రోజుల‌కు ఒక‌సారి ఇలా చేయ‌వ‌చ్చు. అయితే 4 సార్లు ఈ విధంగా ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. అంత‌క‌న్నా ఎక్కువ సార్లు ఈ చిట్కాను ట్రై చేయ‌కూడ‌దు. అవ‌స‌రం అనుకుంటే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి.

హైడ్రోజ‌న్ పెరాక్సైడ్ మిశ్ర‌మాన్ని కూడా చెవుల‌ను క్లీన్ చేసేందుకు వాడ‌వ‌చ్చు. ఈ మిశ్ర‌మాన్ని కూడా 5 నుంచి 10 చుక్క‌ల మోతాదులో ఒక్కో చెవిలోనూ వేయాలి. కానీ కేవ‌లం 5 నిమిషాలే ఉంచాలి. త‌రువాత క‌డిగేయాలి. ఇలా 14 రోజుల్లో 3 సార్లు చేయ‌వ‌చ్చు. దీంతో చెవుల్లోని గులిమి పోతుంది. చెవులు శుభ్ర‌మ‌వుతాయి. చెవుల్లో ఉండే దుర‌ద త‌గ్గుతుంది.

ఇక బేకింగ్ సోడాకు బ‌దులుగా కొబ్బ‌రినూనె లేదా ఆలివ్ నూనెను వాడ‌వ‌చ్చు. ఏదైనా ఒక నూనె తీసుకుని 5 నుంచి 10 చుక్క‌ల‌ను ఒక్కో చెవిలోనూ వేయాలి. ఒక గంట సేపు అయ్యాక క‌డిగేయాలి. ఈ చిట్కాను రోజూ.. ఎన్ని రోజుల వ‌ర‌కైనా పాటించ‌వ‌చ్చు. ఇది సుర‌క్షిత‌మైన ప‌ద్ధ‌తి.

కొన్ని క్లినిక్‌లలో గులిమి తీసేందుకు మైక్రోసక్షన్ పద్ధతిని ఉపయోగిస్తారు. మైక్రోస్కోప్‌తో చెవి లోపలికి చూస్తూ మెల్లిగా గులిమిని బయటకు తీస్తారు. గులిమి సమస్యలు అధికంగా ఉన్నవారికి ఈ పద్ధతి సురక్షితమైనది.