Uttarakhand : మీ పెళ్లి మా సావుకొచ్చింది…వరుడికి కరోనా

ఖటిమా ప్రాంతానికి చెందిన ముంతాజ్ కు యూపీలోని ఫిలిబిత్ జిల్లా చందోయ్ గ్రామానికి చెందిన మల్మాతో వివాహం నిశ్చయమైంది. గురువారం పెళ్లి జరిపించేందుకు ఇరువురు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి కోసం వరుడు, వారి కుటుంబసభ్యులు బరాత్ నిర్వహించుకుంటూ..వధువు గ్రామం చండోయ్ కు బయలుదేరారు.

Uttarakhand : మీ పెళ్లి మా సావుకొచ్చింది…వరుడికి కరోనా

Up

Groom Tests Positive : మీ పెళ్లి మా సావుకొచ్చింది అనుకుంటూ..తిట్టుకుంటూ…బంధువులు వెళ్లిపోయారు. అప్పటిదాక సందడి..సందడిగా ఉన్న పెళ్లిమండపంలో కలకలం రేగింది. కాసేపట్లో పెళ్లి జరుగుతుందని అనగా షాకింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. కొన్ని గంటల్లో ఒక్కటవుతున్నారని అనుకుంటున్న సమయంలో ఊహించని ట్విస్ట్ వచ్చి పడి ఆ పెళ్లి వాయిదా పడింది. భాజాభజంత్రీలతో ఉత్సాహంగా…ఊరేగింపుగా బయలుదేరిన వరుడికి కరోనా సోకడంతో అందరిలో కలవరం స్టార్ట్ అయ్యింది. దీంతో మండపంలో ఉండాల్సిన అతడు హోం ఐసోలేషన్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : Rashmika Mandanna: తమిళ వ్యక్తినే పెళ్లాడతానంటోన్న రష్మిక

ఖటిమా ప్రాంతానికి చెందిన ముంతాజ్ కు యూపీలోని ఫిలిబిత్ జిల్లా చందోయ్ గ్రామానికి చెందిన మల్మాతో వివాహం నిశ్చయమైంది. గురువారం పెళ్లి జరిపించేందుకు ఇరువురు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి కోసం వరుడు, వారి కుటుంబసభ్యులు బరాత్ నిర్వహించుకుంటూ..వధువు గ్రామం చండోయ్ కు బయలుదేరారు. ఇక్కడ రాష్ట్ర సరిహద్దులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో…నెగటివ్ ఉన్నవారినే యూపీలోకి అడుగు పెట్టనిస్తున్నారనే సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకోవడానికి వెళుతున్నాం..వదిలేయండి..అంటూ…వరుడి కుటుంబసభ్యులు వేడుకున్నారు. అయినా..పోలీసులు వినిపించుకోలేదు.

Read More :Nayanthara: చెన్నై ఛాయ్ వ్యాపారంలోకి నయనతార

ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని…నెగటివ్ వస్తే..పంపిస్తామని వెల్లడించారు. మొత్తం 41 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 40 మందికి నెగటివ్ వచ్చింది. ఒక్కరికి పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. ఆ పాజిటివ్ వచ్చింది..వరుడికి అని తెలియడంతో అందరూ షాక్ తిన్నారు. పెళ్లి ఉండడంతో మొత్తం మూడుసార్లు పరీక్షలు నిర్వహించారు. అందులో కూడా…పాజిటివ్ రావడంతో…కుటుంసభ్యులు కలవరం చెందారు. వెంటనే బంధువులందరినీ వెనక్కి పంపించారు. వరుడిని ఐసోలేషన్ సెంటర్ కు పంపించారు. చివరకు చేసేదేమి లేక…పెళ్లిని వాయిదా వేశారు. మీ పెళ్లి మా సావుకొచ్చింది అనకుంటూ వెళ్లిపోయారు.