New Delhi : బైక్ నడుపుతూ కౌగిలింతలు.. ఢిల్లీలో ప్రేమ జంట తీరుపై మండిపడుతున్న నెటిజన్లు

ఢిల్లీ మెట్రోలో వింత చేష్టలు అరికట్టాలని పోలీస్ సిబ్బంది నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అటు రోడ్లపై కూడా ప్రేమ జంటలు పిచ్చి చేష్టలు మొదలు పెట్టారు. బైక్‌పై ఒకరినొకరు కౌగిలించుకుంటూ వెళ్తున్న ప్రేమ జంట వీడియో వైరల్ అవుతోంది.

New Delhi : బైక్ నడుపుతూ కౌగిలింతలు.. ఢిల్లీలో ప్రేమ జంట తీరుపై మండిపడుతున్న నెటిజన్లు

Delhi Viral News

Updated On : May 16, 2023 / 11:53 AM IST

Delhi Viral News : స్కూటర్ పై ప్రయాణిస్తున్న ఓ జంట హెల్మెట్ పెట్టుకోలేదు. పైగా స్కూటర్ నడుపుతూ ఒకరినొకరు హగ్ చేసుకుంటూ కెమెరాకు చిక్కారు. ఢిల్లీ (New Delhi) వాసులకు ఏమైందంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో జంట వీడియో వైరల్..

ఢిల్లీ మెట్రో ఎప్పుడూ వైరల్ న్యూస్‌లో ముందుంటుంది. ఇప్పుడు రోడ్డుపై బైక్ మీద వెళ్తూ కూడా విచిత్రమైన ఫీట్లు చేస్తున్నారు ఢిల్లీలో కొందరు. ఓ ప్రేమ జంట బైక్‌పై వెళ్తూ ఒకరినొకరు కౌగిలించుకుంటున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. హెల్మెట్ ధరించకపోవడంతో పాటు వీరి చేసిన పనికి ఏ మాత్రం బైక్ కింద పడ్డా ప్రాణాలకు ప్రమాదం జరిగేది. ఓ వైపు ఢిల్లీ మెట్రోలో పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న తరువాత ఇప్పుడు తాజాగా రోడ్లపై కూడా ఇలాంటి ఫీట్లు చేస్తున్నారు. shalukashyap28 అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్ట్ చేస్తూ ‘ఢిల్లీ ప్రజలకు ఏమైంది? ఇలాంటి ప్రేమ ఎక్కడా చూడలేదు’ ట్యాగ్ చేసింది.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో మారిన ట్రెండ్.. అద్భుతమైన పాటలతో అలరించిన యువకుడు

ఈ పోస్ట్‌కి లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ‘ఢిల్లీ పోలీసులు సెలవులో ఉన్నప్పుడు ఇలాంటి ప్రేమికులు బయటకు వస్తారని ఒకరు’.. ‘ఇద్దరి ఆనందాన్ని సమాజం ఎందుకు అర్ధం చేసుకోదంటూ’ సరదాగా ఇంకొకరు కామెంట్ చేశారు. మెట్రోల్లో జరుగుతున్నఅశ్లీల కార్యకలాపాలను అరికట్టాలని ఢిల్లీ పోలీసులు రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో ఇటువంటి ఫీట్లు చేస్తున్నవారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీవాసులు కోరుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shalu Kashyap Taneja (@shalukashyap28)