Covid Lung Transplants : కొవిడ్‌తో హై-రిస్క్.. లంగ్స్​ ట్రాన్స్​​ప్లాంటేషన్‌‌కు లక్షల్లో ఖర్చు..!

కరోనా సోకినవారిలో సాధారణంగా ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కూడా అప్పటికే లంగ్స్ బాగా డ్యామేజ్ అయి ఉండటం ప్రాణాంతకంగా మారుతోంది. దాంతో ఊపిరితిత్తుల మార్పిడికి అధిక ధర డిమాండ్ పెరుగుతోంది.

Covid Lung Transplants : కొవిడ్‌తో హై-రిస్క్.. లంగ్స్​ ట్రాన్స్​​ప్లాంటేషన్‌‌కు లక్షల్లో ఖర్చు..!

Covid Lung Transplants

Updated On : June 2, 2021 / 7:45 PM IST

Covid-19 High-Risk High-Cost Lung Transplants : కరోనా సోకినవారిలో సాధారణంగా ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కూడా అప్పటికే లంగ్స్ బాగా డ్యామేజ్ అయి ఉండటం ప్రాణాంతకంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లంగ్స్​ ట్రాన్స్​​ప్లాంటేషన్‌‌‌కు అధిక డిమాండ్ పెరుగుతోంది. కరోనా వస్తే లంగ్స్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. కరోనాతో హై-రిస్క్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చివరి దశలో ఊపిరితిత్తులు దెబ్బతిన్న కరోనా బాధితులు కోలుకున్నాక వారికి లంగ్స్ మార్పిడి చేయాల్సి వస్తోంది.

సాధారణంగా డబుల్ లంగ్స్ మార్పిడి చికిత్సకు అయ్యే ఖర్చు లక్షల్లోనే ఉంటుంది. ప్రస్తుతం డబుల్ లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలంటే రూ. 35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కరోనాతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నవారికి లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ చేయమని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. కానీ, దేశవ్యాప్తంగా లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసే కేంద్రాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే వైద్యులు, నిపుణులు కూడా కొద్దిమంది మాత్రమే ఉన్నారు.

తెలంగాణ ప్రభుత్వ జీవాందన్ కాడవర్ మార్పిడి కార్యక్రమం ( Jeevandan cadaver transplant programme) ప్రకారం.. సుమారు 20 మంది కరోనా బాధితులు లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం నమోదు చేసుకున్నారట.. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న వీరంతా ఊపిరితిత్తుల మార్పిడి కోసం వేచి ఉన్నారు. కొవిడ్ -19 మహమ్మారితో ఊపిరితిత్తుల మార్పిడికి భారీ డిమాండ్ ఏర్పడిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మే 1, 2021 నాటికి, ఆగస్టు 2020, ఏప్రిల్ 2021 మధ్య 8 నెలల్లో 46 ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీలు జరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2013, ఆగస్టు 2020 మధ్య 7 ఏళ్లలో 23 సర్జరీలు జరిగాయి.

మహమ్మారి ప్రభావంతో మూత్రపిండాలు, కాలేయం, గుండె, కార్నియా, ప్యాంక్రియాస్ వంటి ఇతర అవయవాల దానం బాగా తగ్గిపోయింది. ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు సంక్లిష్టంగా ఉంటాయనే చెప్పాలి. ఎందుకుంటే రోగికి చాలా ప్రమాదం కూడా. అందులోనూ ఖరీదైనవి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు చేయలేదు. లంగ్స్ మార్పిడి శస్త్రచికిత్సలో ఖర్చుతో పాటు, ECMO సపోర్టు రోజులు, ఇతర ప్రదేశాల నుంచి అవయవాలను విమానంలో పంపడం, రోగి ఆపరేషన్ తర్వాత నిర్వహణ మొదలైన ఇతర అంశాలు ఖర్చును మరింత పెంచుతాయి.

ఊపిరితిత్తుల మార్పిడిలో ప్రధానమైన సవాలు ఏంటంటే?.. మూత్రపిండాల మార్పిడిలో 12 గంటలకు భిన్నంగా 4 నుంచి 6గంటలలోపు అవయవాన్ని అవసరమైన వ్యక్తి శరీరంలోకి మార్పిడి చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లోని కిమ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌‌‌‌లో గత 8 నెలల్లో వైద్యులు 39 ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీలు జరిగాయి. వాటిలో, కొవిడ్ -19 నుండి పూర్తిగా కోలుకున్న బాధితులపై 14 లంగ్స్ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా జరిగాయి. గత సెప్టెంబరులో కొవిడ్ బాధితుడికి భారతదేశం మొట్టమొదటి డబుల్ లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసిన ఘనత ఇదే సెంటర్‌కు దక్కింది.

కరోనాతో ఊపిరితిత్తుల వ్యాధులు పెరిగిపోతున్నాయి. ఫిల్టర్‌ల ద్వారా రక్తాన్ని నడపడంతో పాటు ఆక్సిజనేట్ చేయడం.. కార్బన్-డి-ఆక్సైడ్‌ను తొలగించి, శరీరంలోకి తిరిగి ఆక్సిజన్ అందించే కృత్రిమ ఊపిరితిత్తులను ఏర్పాటు చేయాలి. ఈ ప్రక్రియకు ECMO (Extracorporeal Membrane Oxygenation) అనే మిషన్ దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. డబుల్ ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సకు 8 నుండి 16 గంటల సమయం పట్టవచ్చు. కరోనా నుంచి కోలుకున్నవారిలో లంగ్స్ డ్యామేజ్ అయితే వారికి రెండు ఊపిరితిత్తుల మార్పిడి అవసరమవుతుంది.

ఈసీఎంలో ఆపరేషన్ చాలా క్లిష్టంగా ఉంటుందని అంటున్నారు వైద్య నిపుణులు. ఆపరేషన్ సమయంలో చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సర్జన్ నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇలా కాకుండా ఉండేందుకు మెడిషన్ ఉపయోగిస్తుంటారు. అందుకే ఈ ఆపరేషన్ విధానం చాలా ఖరీదైనదిగా చెప్పవచ్చు. ఇలాంటి లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ ఖర్చును సామాన్యుల కంటే సంపన్నులు మాత్రమే భరించలగలరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.