Viral Video : కుక్కను చిత్రహింసలు పెడుతున్న వ్యక్తిని కుమ్మిపారేసిన ఆవు
కుక్క చిత్రహింసలు పెడుతున్న వ్యక్తిని ఓ ఆవు కొమ్ములతో కుమ్మిపారేసింది. ఈ వీడియో వైరల్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Cow Attacking On Men Who Harassing Dog
Cow Attacking On Men Who Harassing Dog : ఎవరైనా దుర్మార్గపు పనులు చేస్తుంటే..నువ్వు మనిషివా? పశువ్వా?అని తిడుతుంటారు. కానీ మనిషిని చూసి జంతువులే సిగ్గుపడేలా ఉన్నాయి నేటి పరిస్థితులు. మనిషిని మనిషి హింసిస్తుంటే సాటి మనుషులు పట్టించుకోకుండా ఎవరి దారిని వారు వెళ్లిపోతుంటారు. సాటి మనిషి చావు బతుకుల్లో ఉంటే వీడియోలు తీస్తారు తప్ప కనీసం రక్షించటానికి కూడా ప్రయత్నించరు. అటువంటి మనిషిని జంతువులతో పోలిస్తే జంతువు సిగ్గుపడవా?కచ్చితంగా సిగ్గుపడతాయి.
క్రూరమృగాలుకూడా వాటికి ఆకలేస్తేనే సాటి జంతువుల్ని వేటాడతాయి. కాని మనిషి అలా కాదు. తన పైశాచికానందంకోసం ఏదైనా చేస్తాడు. మూగ జంతువుల్ని హింసిస్తాడు. అవి విలవిల్లాడిపోతుంటే పైశాచికానందం పొందుతాడు. అలా ఓ వ్యక్తి ఓ కుక్కను హింసలు పెడుతున్నాడు. దారినపోయేవారు చూస్తు వెళ్లిపోయారు తప్ప అదేమని అడగలేదు. కానీ ఎక్కడనుంచి వచ్చిందో గానీ ఓ గోమాత కుక్కను చిత్రహింసలు పెడుతున్న వ్యక్తిని కుమ్మిపారేసింది. కిందపారేసి పొడిచి కుక్కను విడిపించింది. దీనికి సంబంధించిన వీడియోను అటవీశాఖాధికారి సుషాంత్ నందా ట్విట్టర్ లో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది.
Read more : భార్య..కొడుకు..పెంపుడు కుక్కని చంపేసి ఇంట్లోనే కుళ్లబెట్టాడు..తరువాత…
ఈ వీడియోలో ఒక వ్యక్తి.. వీధిలో ఉన్న ఓ కుక్కను పట్టుకుని పైకి లాగి హింసించాడు. దాని రెండు చెవులు పట్టుకుని గట్టిగా లాగుతున్నాడు. పాపం.. ఆ బాధకు తాళలేక కుక్క గట్టిగా అరుస్తు విలవిల్లాడిపోయింది. ఆ కుక్క బాధతో అరుస్తుంటే.. ఆ దుర్మార్గుడు పైశాచికానందాన్ని పొందుతున్నాడు. ఎవ్వరు ఆపటానికి ప్రయత్నం చేయడంలేదు.
ఆకుక్క అరుపులు విన్న ఒక ఆవు అటుగా వచ్చింది. గోమాత అంటే తల్లి అన్నట్లుగా ఆదుకుంది. కుక్కను పట్టుకుని హింసిస్తున్న వ్యక్తిపై కొమ్ములతో కుమ్మేసింది. కొమ్ములతో లేపి కిందపడేసి కుమ్మింది. దీంతో ఆ దుర్మార్గుడి బారి నుంచి కుక్క తప్పించింది. ఈ ఘటనతో అక్కడివారంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు అవసరం లేదు.ఈ వీడియోలో మనిషి దుర్మార్గం కనిపిస్తుంటే. జంతువు చూపించిన జాలి..బాధ్యత కనిపిస్తోంది.ఈ వీడియోను దీన్ని అటవీశాఖాధికారి సుషాంత్ నందా.. ‘కర్మ ఫలం’ అనుభవించాల్సిందే.. అంటూ తన ట్విటర్ ఖాతాలో కామెంట్‌ను జతచేసి పోస్ట్ చేశారు.
Read more : Squirrel Play With Humans : ప్రాణం కాపాడిన బాలుడిని వదిలి వెళ్లనంటున్న బుజ్జి ఉడుత..
Karma ?? pic.twitter.com/AzduZTqXH6
— Susanta Nanda IFS (@susantananda3) October 31, 2021