Commonwealth Games: పాక్‌పై 8 వికెట్ల తేడాతో టీమిండియా అమ్మాయిల గెలుపు

ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జ‌రుగుతోన్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భాగంగా నిర్వ‌హించిన భార‌త్, పాకిస్థాన్ మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు మ్యాచులో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజ‌య దుందుభి మోగించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18 ఓవ‌ర్ల‌లో 99 ప‌రుగుల వ‌ద్ద‌ ఆలౌట్ అయింది. ఓపెనర్‌ స్మృతీ మంధాన 63 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది

Commonwealth Games: పాక్‌పై 8 వికెట్ల తేడాతో టీమిండియా అమ్మాయిల గెలుపు

Bcci Women

Commonwealth Games: ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జ‌రుగుతోన్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భాగంగా నిర్వ‌హించిన భార‌త్, పాకిస్థాన్ మ‌హిళ‌ల క్రికెట్ మ్యాచులో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజ‌య దుందుభి మోగించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18 ఓవ‌ర్ల‌లో 99 ప‌రుగుల వ‌ద్ద‌ ఆలౌట్ అయింది. ల‌క్ష్య ఛేద‌నలో భారత క్రికెట్ జ‌ట్టు అమ్మాయిలు ధాటిగా ఆడారు. ఓపెనర్‌ స్మృతీ మంధాన 63 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.

రెండు వికెట్లను మాత్రమే నష్టపోయిన టీమిండియా 11.4 ఓవర్లలో ల‌క్ష్యాన్ని ఛేదించింది. 102 పరుగులు చేసింది. టీమిండియాలో షఫాలీ వర్మ 16 ప‌రుగులు చేయ‌గా, సబ్బినేని మేఘన 14 ప‌రుగులు చేసి ఔట‌య్యారు. రోడ్రిగ్స్ 2 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. పాకిస్థాన్‌ బౌలర్లలో టుబా హసస్, సొహైల్‌కు ఒక్కో వికెట్ ద‌క్కింది. పాక్ క్రికెట్ జ‌ట్టులో మునీబా అలీ 30 బంతుల్లో 32 ప‌రుగులు చేసి టాప్ స్కోర‌ర్‌గా నిలిచింది. ఇరం జావెద్ డ‌కౌట్ కాగా, మ‌రూఫ్ 17, సొహైల్ 10, ఆయేషా న‌సీమ్ 10, అలియా రియాజ్ 18, ఫాతిమా స‌నా 8, కైనాత్ 2, డియానా డ‌కౌట్‌, హ‌స‌న్ 1 ప‌రుగులు చేశారు.

China: అంద‌రినీ భ‌య‌పెట్టిన త‌మ‌ రాకెట్ శ‌కలాలు ఎక్క‌డ ప‌డ్డాయో తెలిపిన చైనా