Daimond Rathnababu : చిరంజీవి, మోహన్‌బాబు ఎప్పటికి కలిసే ఉంటారు

డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ.. ''చిరంజీవితో ఈ మూవీకి వాయిస్ ఓవర్ చెప్పించాలన్న ఆలోచన నాదే. ఈ సినిమాలో ఉన్నత భావాలు గల మోహన్ బాబు పాత్రని పరిచయం చేస్తూ వాయిస్ ఓవర్ వుండాలని....

Daimond Rathnababu : చిరంజీవి, మోహన్‌బాబు ఎప్పటికి కలిసే ఉంటారు

Chiranjeevi

Daimond Rathnababu :  ‘మా’ ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి టాలీవుడ్ లో జరుగుతున్న కొన్ని పరిణామాలు చూసి, అలాగే సినీ పరిశ్రమ సమస్యల కోసం ప్రభుత్వంతో చిరంజీవి మాట్లాడటం, తర్వాత మంచు విష్ణు ప్రత్యేకంగా కలవడం.. ఇలాంటి పరిణామాలతో మోహన్ బాబు, చిరంజీవి మధ్య మళ్ళీ విభేదాలు తలెత్తాయి అని అందరూ అనుకుంటున్నారు. వీరు ఇండైరెక్ట్ గా మాట్లాడిన కొన్ని మాటల వల్ల కూడా చాలా మందికి ఇలాగే అర్ధం అయింది.

ప్రస్తుతం మోహన్ బాబు మెయిన్ లీడ్ లో చేసిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా ఫిబ్రవరి 18న రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా ప్రోమోకి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ‘సన్ ఆఫ్ ఇండియా’ డైరెక్టర్ డైమండ్ రత్నబాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు, చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలని తెలియచేశారు.

RGV : ‘భీమ్లా నాయక్’ విడుదలపై ఆర్జీవీ ట్వీట్.. ‘పుష్ప’ని బీట్ చేస్తాడా అంటూ.. ఫ్యాన్స్ మధ్య చిచ్చు

డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ.. ”చిరంజీవితో ఈ మూవీకి వాయిస్ ఓవర్ చెప్పించాలన్న ఆలోచన నాదే. ఈ సినిమాలో ఉన్నత భావాలు గల మోహన్ బాబు పాత్రని పరిచయం చేస్తూ వాయిస్ ఓవర్ వుండాలని అనుకున్నాను. దాన్ని మరెవరితోనో చెప్పిస్తే బాగుండదని భావించి మెగాస్టార్ చిరంజీవి అయితే బాగుంటుందని మోహన్ బాబుకి చెప్పడంతో ఆయన వెంటనే చిరంజీవిగారికి ఫోన్ లో చెప్పడం జరిగింది. వీలు చూసుకుని ఎప్పుడు వాయిస్ ఓవర్ చెప్పినా ఫరవాలేదని చిరంజీవిగారితో మోహన్ బాబు చెప్పారు. కానీ ఆయన మరుసటి రోజే వాయిస్ ఓవర్ ఇచ్చి షాకిచ్చారు.

అలాంటి అవినాభావ సంబంధం ఇద్దరి మధ్య వుంది. నేను దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా చెబుతున్నాను మోహన్ బాబు, చిరంజీవి గారి మధ్య స్నేహ సంబంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. చిరంజీవి గారు, మోహన్ బాబు గారు ఎప్పటికీ కలిసే వుంటారు. మధ్యలో వీళ్లు విడిపోయార్రా అని అనుకునే వాళ్లే భ్రమల్లో తేలుతుంటారు” అంటూ చిరంజీవి, మోహన్ బాబు మధ్య ఉన్న స్నేహ బంధాన్ని తెలిపారు.

Bappi Lahiri : బప్పీ లహరి బయోపిక్.. హీరోగా రణవీర్ సింగ్??

అయితే ఆయన చెప్పిందంతా ‘మా’ ఎలక్షన్స్ కి ముందు జరిగిన వాటిని బేస్ చేసుకొని చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. గతంలో కూడా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, మాట్లాడే మాటలతో కూడా మళ్ళీ వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు అంతా అనుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి కనిపిస్తే లేదా వీటిపై మాట్లాడితే తప్ప వీటికి ముగింపు ఉండదు.