వరుస ఉగ్రదాడులతో రక్తమోడుతున్న ఆఫ్గనిస్తాన్

  • Published By: venkaiahnaidu ,Published On : May 14, 2020 / 08:26 AM IST
వరుస ఉగ్రదాడులతో రక్తమోడుతున్న ఆఫ్గనిస్తాన్

ప్రపంచదేశాలన్నీ కరోనా కట్టడిలో తలమునకలై ఉన్న వేళ ఉగ్రసంస్థలు యాక్టివ్ గా పనిచేస్తూ దాడులకు పాల్పుడుతూనే ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు వరుస బాంబు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా గురువారం తూర్పు ఆఫ్గనిస్తాన్ లోని గర్దాజ్ సిటీలోని ఓ మిలటరీ కోర్టుకి దగ్గర్లో తాలిబన్లు పేలుడు పదార్థాలు ఉన్న ఓ ట్రక్కుని బ్లాస్ట్ చేయడంతో 5గురు సమాన్య పౌరులు చనిపోగా,14మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆఫ్గనిస్తాన్ ఇంటీరియర్ మంత్రిత్వశాఖ ప్రతినిధి తారిఖ్ అరియన్ తెలిపారు.

మిలటరీ కోర్టు దగ్గర బాంబు దాడులు జరిపింది తామేనని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మీడియాకు వాట్సప్ మేసేజ్ చేశాడు. కాగా, రెండు రోజుల క్రితం ఓతాలిబన్ ఉగ్రవాది రాజధాని కాబుల్ లోని ఓ హాస్పిటల్ లోని మెటర్నిటీ వార్డులో విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో పలువురు మహిళలు,అప్పుడే పట్టిన పనికందులతో సహా 24మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అదే రోజు తూర్పు నన్గహర్ లోని ఓ అంతియమాత్రపై ISIS జరిపిన ఆత్మహుతి దాడిలో 32మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఉగ్రవాదుల వరుస దాడులను ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఖండించారు. అమెరికా ప్రభుత్వం ఆఫ్గనిస్తాన్ లోని తమ దళాలను ఉపసంహరించుకోవడంతో రక్షణాత్మక వైఖరిని అవలంభిస్తున్న ఆఫ్గాన్ మిలటరీ.. ఇక ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని,మిలిటెంట్లపై దాడులను పునరుద్దరించాలని  అధ్యక్షుడు ఆఫ్రఫ్ ఘని మిలటరీని ఆదేశాంచారు.

కాగా, ఆఫ్గనిస్తాన్ లో కరోనా తీవ్రత పెద్దగా లేదు. ఇప్పటివరకు ఆఫ్గనిస్తాన్ లో 5,526 కరోనా కేసులు నమోదుకాగా,132మరణాలు నమోదయ్యాయి. 648మంది కోలుకున్నారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా నేపధ్యంలో దేశాలన్నీ వైరస్ కట్టడిలో తలమునకలై ఉన్నవేళ… ఇదే అదునుగా భావించిన ISIS తమ నెట్ వర్క్ ను పెంచుకుంటున్నట్లు ఇరాక్ లోని నార్వేజియన్ ఫోర్సెస్ తెలిపాయి.

Read Here>> ఒమన్ తీరంలో భారీ ప్రమాదం…సొంత నౌకనే మిసైల్ తో పేల్చేసిన ఇరాన్