Dear KCR Garu: ‘కేసీఆర్ గారూ.. సర్జికల్ స్ట్రైక్‌పై ఇదిగో సాక్ష్యం’

తెలంగాణ సీఎం కేసీఆర్.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మల మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ తో సహా సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడారు.

Dear KCR Garu: ‘కేసీఆర్ గారూ.. సర్జికల్ స్ట్రైక్‌పై ఇదిగో సాక్ష్యం’

Kcr Himanta

Surgical Strikes: తెలంగాణ సీఎం కేసీఆర్.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మల మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ తో సహా సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు అసోం సీఎం కౌంటర్ హిమంత బిశ్వ శర్మ కౌంటర్ ఇచ్చారు. సర్జికల్ స్ట్రైక్ మీద సాక్ష్యం కావాలంటూ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ అడిగిన మాటలకు సపోర్ట్ చేస్తున్నారా అంటూ సీఎం కేసీఆర్ పై కౌంటర్లు విసిరారు.

‘డియర్ కేసీఆర్ గారూ.. ఇదిగోండి సర్జికల్ స్ట్రైక్ మీద సాహసోపేతమైన ఆర్మీ నిర్వహించిన వీడియోగ్రాఫిక్ సాక్ష్యమిదే. దీన్ని ఛాలెంజ్ చేస్తున్నారంటే ఆర్మీని అవమానించినట్లే. ఎందుకని మన సైన్యంపై దాడి చేసి దుష్ప్రచారం చేయడానికి తహతహలాడుతున్నారు? సైన్యాన్ని అవమానించడాన్ని నవ భారతదేశం సహించదు’ అంటూ పోస్టు పెట్టారు.

‘రాహుల్ గాంధీ సర్జికల్ స్ట్రైక్ సాక్ష్యం గురించి అడగడంలో తప్పులేదు. ఇప్పుడు నేను అడుగుతున్నా. ఆ సాక్ష్యాలు చూపించడం ఇండియా బాధ్యత’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

Read Also: జాతీయ రాజకీయాల్లో.. కేసీఆర్ వ్యాఖ్యల దుమారం..!

తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలపై కామెంట్ చేస్తూ.. ‘మేం సిగ్గుతో తలను వంచుకున్నాం. దేశం కోసం ఇది అస్సలు మంచి విషయం కాదు’ అని అన్నారు.