Body Cams: ఖైదీలపై నిఘా.. క్రిమినల్స్ కోసం బాడీ కెమెరాలు

జైళ్లలో నిఘా పెట్టేందుకు టెక్నాలజీ సాయాన్ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు అధికారులు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని తీహార్ జైలు అధికారులు 375 బాడీ కెమెరాలను కొనుగోలు చేశారు.

Body Cams: ఖైదీలపై నిఘా.. క్రిమినల్స్ కోసం బాడీ కెమెరాలు

Body Cams

Body Cams: జైళ్లలో నిఘా పెట్టేందుకు టెక్నాలజీ సాయాన్ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు అధికారులు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని తీహార్ జైలు అధికారులు 375 బాడీ కెమెరాలను కొనుగోలు చేశారు. జైలు నిర్వహణ విషయంలో భద్రత కోసం కెమెరాలను కొనుగోలు చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. తీహార్ జైలులో ఇప్పటికే 150 బాడీ వేర్ కెమెరాలు ఉండగా.. వాటికి తోడు ఇప్పుడు అప్‌గ్రేడ్ టెక్నాలజీతో మరో 375 బాడీ కామ్‌లను కొనుగోలు చేసినట్లు చెప్పారు తీహార్ జైలు అధికారులు.

బాడీ కెమెరాలను పెట్టడం ద్వారా జైలులో ఖైదీలపై నిఘా మరింత పెంచాలని నిర్ణయించినట్లు తీహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు. ఢిల్లీలోని 16 జైళ్లలో మొత్తం 18వేల మంది ఖైదీలు ఉన్నారు. ఒక్క తీహార్ జైలులోని మూడు కాంప్లెక్సుల్లోనే 12వేలమందికి పైగా ఖైదీలు ఉన్నారని, వీరిలో క్రిమినల్స్ చాలామంది ప్రమాదకరమైన వ్యక్తులు కాగా.. వారిపై నిఘా కోసం అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకుని వచ్చారు. నిఘా కోసం ప్రతీ వార్డులో రెండు మూడు కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు జైలు అధికారులు నిర్ణయించారు.

జైలు వార్డర్లకు బాడీవేర్ కెమెరాలు ఇస్తామని, వార్డర్లకు ఇచ్చే బాడీవేర్ కెమెరాలు 7 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో హై రెజల్యూషన్ రికార్డింగ్‌తో వాటిని అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు అధికారులు చెప్పారు. జైళ్లలో మూడు కాంప్లెక్స్‌లలో 7,000 సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రదేశాలు ఇప్పటికీ కవర్ కావట్లేదని, అందుకే ఈ ప్రదేశాలలోనే బాడీ కెమెరాలు ఉన్న జైలు సిబ్బంది ఉంటారని, తరచుగా తనిఖీలు చేసే వీలుంటుందని చెప్పారు.

గ్యాంగ్‌స్టర్ అంకిత్ గుజ్జార్ జైలు గదిలో ఇటీవల చనిపోగా.. జైలు సిబ్బందే అతన్ని కొట్టి చంపేశారని ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి సందర్భాలలో కెమెరాలు డిజిటల్ ఆధారాలను అందిస్తాయని అధికారులు చెబుతున్నారు.