Delhi : రూ. 2000 నోటు ఇవ్వండి.. రూ.2,001 విలువైన వస్తువులు పట్టుకెళ్లండి

వ్యాపారస్తులు అన్నాక ఎప్పటికప్పుడు సరికొత్త ఐడియాలతో ముందుకు పోవాలి. పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోగలగాలి. రూ.2000 రూపాయలు ఉపసంహరించుకుంటున్నట్లు RBI ప్రకటించిన నేపథ్యంలో అమ్మకాలు పెంచుకునేందుకు ఢిల్లీలోని ఓ మీట్ షాప్ ఓనర్‌కి వచ్చిన ఐడియా చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.

Delhi : రూ. 2000 నోటు ఇవ్వండి.. రూ.2,001 విలువైన వస్తువులు పట్టుకెళ్లండి

Delhi

Delhi meat shop owner’s innovative idea : RBI రూ. 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వ్యాపారస్తులకు వినూత్నమైన ఐడియాలు వస్తున్నాయి. ఢిల్లీలో ఓ మీట్ షాప్ ఓనర్ ‘రూ.2000 నోటు ఇవ్వండి.. రూ.2,100 విలువైన వస్తువులను తీసుకెళ్లండి’ అని బోర్డు పెట్టాడు. అతని తెలివికి జనం ఆశ్చర్యపోతున్నారు.

RBI : సెప్టెంబర్ 30 తర్వాత రూ.2వేల నోట్లు చెల్లవని చెప్పలేదు.. ఆర్బీఐ మరో కీలక ప్రకటన

రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఇటీవలే RBI ప్రకటించింది. రూ.2000 నోట్లు కలిగి ఉన్నవారు సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో డిపాజిట్ లేదా మార్చుకోవచ్చు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే జనం రూ.2000 నోటును మార్చుకోవడానికి.. నగలు కొనుగోలు చేయడానికి బ్యాంకుల వద్ద క్యూలు కట్టడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని GTB నగర్‌కి చెందిన ఓ మాంసం వ్యాపారి ఇదే అదనుగా తన షాపులో అమ్మకాలు పెంచుకోవాలని అనుకున్నాడు. వినూత్నమైన ఐడియాను ఫాలో అయిపోయాడు.

 

వెంటనే షాప్ యజమాని ‘రూ.2000 నోట్ ఇవ్వండి.. రూ.2,100 కు సరిపడా వస్తువుల్ని తీసుకెళ్లండి’ అని నోటీసు పెట్టాడు. ఆ నోటీస్ మీద రెండు రూ.2000 నోట్లను అతికించాడు. Sumit Agarwal అనే ట్విట్టర్ యూజర్ ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. ‘ఆర్‌బిఐ తెలివైనదని మీరు అనుకుంటే, ఢిల్లీ వాసులు మరింత తెలివైనవారు కాబట్టి మరోసారి ఆలోచించండి. మీ అమ్మకాలను పెంచుకోవడానికి ఎంత వినూత్నమైన మార్గం’ అనే శీర్షికను యాడ్ చేశారు.

RBI : రూ. 2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్‌బీఐ క్లారిటీ

ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘మౌకే పె చౌకా’ అని ఒకరు.. ‘అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవడమే వ్యాపార స్వభావం’ అని మరొకరు వరుసగా ట్వీట్లు చేశారు. ఏది ఏమైనా ఈ బిజినెస్ ఐడియా మీట్ షాప్ ఓనర్‌కి ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.