RBI : సెప్టెంబర్ 30 తర్వాత రూ.2వేల నోట్లు చెల్లవని చెప్పలేదు.. ఆర్బీఐ మరో కీలక ప్రకటన

2016 నవంబర్ లో రూ.2 వేల నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టింది. అప్పటివరకు చెలామణిలో ఉన్న రూ.1000 నోట్ల స్థానంలో రూ.2వేల నోట్లను తీసుకొచ్చింది.

RBI : సెప్టెంబర్ 30 తర్వాత రూ.2వేల నోట్లు చెల్లవని చెప్పలేదు.. ఆర్బీఐ మరో కీలక ప్రకటన

RBI Key Announcement

RBI Key Announcement : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరో కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 30 తర్వాత రూ.2వేల నోట్లు చెల్లవని చెప్పలేదని తెలిపింది. అప్పటి పరిస్థితిని బట్టి ఏం చేయాలో ఆ తర్వాత నిర్ణయిస్తామని పేర్కొంది. రూ.50 వేలకు మించి బ్యాంకులో డిపాజిట్ చేస్తే పాన్ నెంబర్ ఇవ్వాల్సిందేనని వెల్లడించింది.రూ.1000 నోటును పున:ప్రవేశ పెట్టే ప్రతిపాదనేది తమ వద్ద లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.

చెలామణిని నుంచి ఉపసంహరించుకున్న రూ.2 వేల కరెన్సీ నోట్ల మార్పిడికి వాణిజ్య బ్యాంకుల్లో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేటి నుంచి (మంగళవారం) నుంచి మార్చుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగనుందని పేర్కొంది. ఆర్బీఐ ఇప్పటికే ఇందుకు సబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక్కొక్కరు రోజుకు పది నోట్లను మార్చుకునే అవకాశం కల్పించింది.

2000 Rupee Note: బ్యాంకుల్లో నేటి నుంచి 2వేల నోట్లు మార్చుకోవచ్చు.. ఒకేసారి ఎన్ని నోట్లు మార్చుకోవచ్చో తెలుసా?

ఒక్కో విడతలో 20 వేల రూపాయల విలువైన నోట్లను మార్పిడి చేసుకోవచ్చు. తమ దగ్గరున్న మొత్తం రూ.2వేల నోట్లను ఒకేసారి తీసుకొచ్చి మార్చుకోవడం కుదరదని తేల్చి చెప్పారు. మార్పిడికి సంబంధించిన రోజు వారి సమాచారాన్ని నిర్ణీత నమూనాలో అందించాలని ఆర్బీఐ ఆదేశించింది. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు మే 19న ఆర్బీఐ ప్రకటించింది.

నగదు నిర్వహణలో భాగంగా రూ.2వేల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుంది. 2016లో నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలోకి వేగంగా నగదును చొప్పిండంలో భాగంగానే రూ.2వేల నోటును తీసుకొచ్చినట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 30 నాటికి చాలా వరకు నోట్లు ఖజానాకు చేరుతాయని ఆర్బీఐ ఆశిస్తోంది. రూ.2 వేల నోట్ల మార్పిడికి నాలుగు నెలల సమయం సరిపోతుందని ఆర్బీఐ భావిస్తోంది. అవసరమైతే మార్పిడి గడువు పొడిగించే అంశాన్ని ప్రకటించింది.

BV Raghavulu : రూ.2వేల నోటు ఉపసంహరణ.. బీవీ రాఘవులు సంచలన వ్యాఖ్యలు

ఇక రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్లకు పాన్ సమర్పించాలనే నిబంధన ఉంది. రూ.2వేల నోట్ల డిపాజిట్లకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. రూ.2వేల నోట్ల స్థానంలో ఇతర నోట్లను ఇచ్చేందుకు తగినంత నగదును ఆర్బీఐ అందుబాటులో ఉంచింది. చెలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2వేల నోట్ల వాటా 10.18 శాతం. పెద్ద మొత్తంలో అయ్యే డిపాజిట్లను ఆదాయ శాఖ తనిఖీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

2016 నవంబర్ లో రూ.2 వేల నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టింది. అప్పటివరకు చెలామణిలో ఉన్న రూ.1000 నోట్ల స్థానంలో రూ.2వేల నోట్లను తీసుకొచ్చింది. 2018, 2019 నుంచి రూ.2వేల నోట్ల ప్రింటింగ్ ను ఆపేసింది. 2018 మార్చి31 నాటికి 6లక్షల 73 వేల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు చెలామణిలో ఉంటే, 2023 మార్చి 31 నాటికి 3లక్షల 62 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు సర్క్యూలేషన్ లో ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది.