Delhi Power Crisis : రెండు రోజుల్లో చీక‌ట్లు.. దేశ రాజధానిలో తీవ్ర విద్యుత్ సంక్షోభం

దేశ రాజ‌ధాని ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం తీవ్ర‌త‌ర‌మ‌వుతోంది. ఢిల్లీలో చీకట్లు అలుముకోనున్నాయి. కేంద్రం నుంచి తాము కోరినంత విద్యుత్ స‌ర‌ఫ‌రా లేకుంటే రాబోయే రెండు రోజుల్లో ఢిల్లీ అంత

Delhi Power Crisis : రెండు రోజుల్లో చీక‌ట్లు.. దేశ రాజధానిలో తీవ్ర విద్యుత్ సంక్షోభం

Delhi Power Crisis

Delhi Power Crisis : దేశ రాజ‌ధాని ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం తీవ్ర‌త‌ర‌మ‌వుతోంది. ఢిల్లీలో చీకట్లు అలుముకోనున్నాయి. కేంద్రం నుంచి తాము కోరినంత విద్యుత్ స‌ర‌ఫ‌రా లేకుంటే రాబోయే రెండు రోజుల్లో ఢిల్లీ అంత‌టా చీక‌ట్లు ముసురుకుంటాయ‌ని ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు.

మోదీ స‌ర్కార్‌పై ఢిల్లీ ప్ర‌భుత్వం తీవ్ర‌స్ధాయిలో విరుచుకుప‌డింది. బొగ్గు కొర‌త‌తో ఢిల్లీలో పవర్ క్రైసిస్ తీవ్రతరమవుతోందని చెప్పింది. ఢిల్లీలో ఇంధ‌న సంక్షోభం వెనుక రాజ‌కీయ మ‌త‌ల‌బు ఉంద‌ని ఆరోపించింది. గ‌తంలో కొవిడ్‌-19 సెకండ్ వేవ్ స‌మ‌యంలో నెల‌కొన్న ఆక్సిజ‌న్ సంక్షోభం త‌ర‌హాలో ఇది మాన‌వ‌ త‌ప్పిదంలా క‌నిపిస్తోంద‌ని ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఢిల్లీకి అవ‌స‌ర‌మైన దానికంటే మూడున్న‌ర రెట్లు అధికంగా ఉత్ప‌త్తి సామ‌ర్ధ్యం ఉన్నా ఆ స్ధాయిలో విద్యుత్ ఉత్ప‌త్తి చేప‌ట్ట‌లేక‌పోతున్నామ‌ని చెప్పారు.

Flipkart: మళ్లీ అవకాశం రాకపోవచ్చు.. ఫ్లిప్ కార్ట్‌లో రూ.10వేల లోపు టాప్-5 ఫోన్‌లు ఇవే!

విద్యుత్ సంక్షోభాన్ని అధిగ‌మించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం ఎంత ఖ‌రీదైనా వెన‌క్కి త‌గ్గ‌కుండా విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఢిల్లీలో విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉందని సీఎం కేజ్రీవాల్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం ఏర్పడటంతో ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేసే కంపెనీలపైనా ప్రభావం పడుతుందని, కరెంట్ సప్లయ్ కు ఆటంకం కలగకుండా జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని కోరారు. పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా, జనరేషన్ ప్లాంట్లకు గ్యాస్ సరఫరా సజావుగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రధానికి రాసిన లేఖలో కోరినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరారు కేజ్రీవాల్.

Air Conditioners : ఏసీల వినియోగం ఆరోగ్యానికి లాభమా…నష్టమా?..

మరోవైపు కరెంటును తెలివిగా ఉపయోగించుకోని బాధ్యతయుతమైన పౌరుడిగా ఉండాలంటూ… టాటా పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ఢిల్లీ ప్రజలకు సూచించింది. ఈ మేరకు SMS ద్వారా సమాచారం పంపింది.

కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా బొగ్గు, గ్యాస్ సరఫరా తక్కువగా ఉండడమే కారణం. బొగ్గు సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. పారిశ్రామిక రంగంలో విద్యుత్ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. అయితే.. డిమాండ్ కు తగ్గట్టుగా బొగ్గు సరఫరా కావడం లేదు.