Covid In Delhi : ఢిల్లీలో కోవిడ్ విజృంభణ..భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు

ఢిల్లీలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇవాళ కొత్తగా 15,097 కేసులు,6 మరణాలు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. కోవిడ్ పాజిటివిటీ రేటు

Covid In Delhi : ఢిల్లీలో కోవిడ్ విజృంభణ..భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు

Covid (4)

Covid In Delhi : ఢిల్లీలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇవాళ కొత్తగా 15,097 కేసులు,6 మరణాలు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. కోవిడ్ పాజిటివిటీ రేటు 15.34శాతానికి చేరుకున్నట్లు తెలిపింది.

ఇక,తాజా కేసులతో కలిపి ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 14,89,463కి చేరుకోగా,మరణాల సంఖ్య 25,127కి చేరింది. 14.32లక్షల మందికి పైగా కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 31,498 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి.

అయితే కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధానిలో ఆప్ ప్రభుత్వం లాక్ డౌన్ విధించే అవకాన్ని పరిశీలిస్తుందా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు..ఇప్పటికే వీకెండ్ కర్ఫ్యూ,నైట్ కర్ఫ్యూ వంటి పలు కఠిన చర్యలను ఢిల్లీ ప్రభుత్వం తీసుకుందని,ప్రస్తుతానికి ఇవి సరిపోతాయని,ఇప్పటికైతే లాక్ డౌన్ అవసరం లేదని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ సమాధానమిచ్చారు.

హాస్పిటల్స్ బెడ్స్ కొరత లేదని,ఇన్ఫెక్షన్ల తీవ్రత ఈ సారి చాలా తక్కువగానే ఉందని,రాబోయే కఠిన సమయాలను దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కొద్ది రోజుల క్రితం బెడ్స్ సంఖ్య 9వేలుగా ఉండగా,ఇప్పుడు 12వేలకు పైగా ఉన్నాయని తెలిపారు.

ALSO READ Punjab Election : 15 నిమిషాలకే మోదీకి ఇబ్బంది..రైతులకు ఏడాది కష్టం!