ఏం జరిగిందో?!.. పక్కింటిలో కుళ్లిపోయిన శవాలు..పక్కనే మద్యం సీసాలు..ట్యాబ్లెట్లు

దేశ రాజధాని ఢిల్లీలో రెండు కుళ్లిపోయిన మృతదేహాలు కలకలం సృష్టించాయి. ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పదమృతి కలకలం రేపింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. తమ పక్కనే ఇంత దారుణం జరిగిందా? అంటూ షాక్ అయ్యారు. కొన్ని రోజుల నుంచి దుర్వాసన వస్తుంటే ఏదో జంతువు చనిపోయిందని అనుకున్న స్థానికులు ఆ దుర్వాసన ఓ ఇంటిలోంచి వస్తోందని తెలిసి పోలీసులకు సమాచారం అందించటంతో ఓ ఇంటిలో రెండు కుళ్లిపోయిన మృతదేహాల విషయం బైటపడింది.

ఏం జరిగిందో?!.. పక్కింటిలో కుళ్లిపోయిన శవాలు..పక్కనే మద్యం సీసాలు..ట్యాబ్లెట్లు

Delhi two Persons dead in a house  : దేశ రాజధాని ఢిల్లీలో రెండు కుళ్లిపోయిన మృతదేహాలు కలకలం సృష్టించాయి. ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పదమృతి కలకలం రేపింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. తమ పక్కనే ఇంత దారుణం జరిగిందా? అంటూ షాక్ అయ్యారు. కొన్ని రోజుల నుంచి దుర్వాసన వస్తుంటే ఏదో జంతువు చనిపోయిందని అనుకున్న స్థానికులు ఆ దుర్వాసన ఓ ఇంటిలోంచి వస్తోందని తెలిసి పోలీసులకు సమాచారం అందించటంతో ఓ ఇంటిలో రెండు కుళ్లిపోయిన మృతదేహాల విషయం బైటపడింది.

తిలక్ నగర్ లోని ఓ ఇంటి నుంచి ఒకటే దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు ఏదో జంతువు చనిపోయిందని అనుకున్నారు. కానీ ఆవాసన అంతకంతకు ఎక్కువ అవుతుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వెళ్లి ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఓ యువతి, యువకుడు అనుమానాస్పద స్థితిలో విగత జీవులుగా పడి ఉన్నారు. ఆ మృతదేహాల పక్కనే మద్యం బాటిల్స్, కొన్ని ట్యాబ్లెట్లు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు.ఆ మృతదేహాలు గురించి పోలీసులు దర్యాప్తు చేయగా..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన పవన్ పలివల్ అనే 29 ఏళ్ల యువకుడు ఢిల్లీలో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. మోడలింగ్‌లో రాణించాలనే తపనతో ఆ దిశగా కూడా ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నాడు. నైనితాల్‌కు చెందిన ప్రియాంక బిశ్త్ అనే 23ఏళ్ల యువతి కూడా గూర్గావ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కన్సల్టెంట్‌గా పనిచేస్తోంది. ఈక్రమంలో ఈ ఇద్దరూ మధ్య స్నేహం ఏర్పడింది. తక్కువ రోజుల్లోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. వీరిద్దరూ మహబీర్ నగర్‌లోని అద్దె ఇంట్లో అప్పుడప్పుడూ కలుస్తూ ఉండేవారు. పార్టీలు చేసుకునేవారు. కానీ ఏమైందో తెలియదు గానీ.. ఓ రోజు ఆ ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇంటిని పరిశీలించారు.

ఆ ఇంటి తలుపులు లోపల లాక్ చేసి ఉండటాన్ని గమనించిన పోలీసులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లారు. ఇంటి లోపల పవన్, ప్రియాంక విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసిన పోలీసులు వారి కుటుం సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన పోలీసులు రెండుమూడు రోజుల క్రితమే వారిద్దరూ చనిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఊర్విజ గోయల్ అంచనా ప్రకారం…యువతిని కలిసేందుకు రెండు రోజుల క్రితం ఆ యువకుడు వచ్చి ఉండొచ్చని..అలా ఇద్దరూ కలిసి మద్యం తాగి ఉండొచ్చని ఆ పక్కనే..స్పాట్‌లో ఖాళీ మద్యం బాటిల్ తో పాటు కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఉండటంతో వాళ్లు సూసైడ్ చేసుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కాగా..ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదనీ..తెలిపారు. మతుల కుటుంబ సభ్యులను..సన్నిహితంగా మెలిగిన వ్యక్తులను విచారిస్తే కారణమేంటో తెలిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ కేసును పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.